- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడో వన్డేకు వార్నర్‌కు దూరం!
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: టీమిండియాతో సిడ్నీలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ బంతిని ఆపే క్రమంలో గజ్జల్లో గాయంతో విలవిల్లాడాడు. వెంటనే జట్టు ఫిజియో, సహచర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అతడిని డ్రెస్సింగ్ రూంకు తీసుకెళ్లారు. అక్కడ ఫిజియో అతడిని పరీక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్‌ను ఆసుపత్రిలో చేర్పించింది. అక్కడ ఎక్స్‌రేతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో ఏమి తేలిందో బయటకు వెల్లడించలేదు. ఒకవేళ వార్నర్‌కు తీవ్రమైన గాయం అయితే తర్వాతి వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. అంతే కాదు గాయం తీవ్రతను బట్టి టీ20 సిరీస్‌కి కూడా దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మ్యాచ్‌లో వార్నర్ 83 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
Advertisement
Next Story