కన్నకూతురి కళ్లెదుటే ఆ పనిచేసిన తల్లిదండ్రులు.. షాక్‌లో తమ్ముడు

by Sumithra |
murder
X

దిశ,వెబ్‌డెస్క్ : ఏంతో ఆనందంగా జీవించే ఓ కుంటుంబంలో ఆఫీసు సమయం చిచ్చుపెట్టింది. ఓ కూతురికి, కొడకుకు కన్నతండ్రిని దూరం చేసింది. ఓ భార్యకు భర్త లేకుండా చేసింది. చిన్న గొడవ ఓ కుటుంబంలో విషాదం నిపింది. భార్య చేతిలోంచి కత్తి లాక్కునే క్రమంలో అది కాస్త భర్త ఛాతిలో దిగి భర్త మరణించిన ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గురుగ్రామ్‌లో సచిన్, గుంజన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు. సచిన్ గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. గుంజాన్ ఓ ఎక్స్‌పోర్ట్ హౌస్‌లో పనిచేస్తుంది. ఎంతో ఆనందంగా వీరి జీవనం సాగుతుంది.

అయితే సచిన్ పనిలో నిమగ్నం అయ్యి ఎక్కువసేపు ఆఫీసులోనే ఉండేవాడు. దీంతో గుంజన్‌కు సచిన్ మీద ఎప్పుడూ కోపంగా ఉండేది. ఎప్పుడూ ఆఫీసులోనే కాకుండా ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ సేపు ఉండచ్చుగా అని సచిన్ పై విరుచకపడేది. ఈ విషయంలోనే చాలా సార్లు వీరికి గొడవలు కూడా జరిగాయి. అయితే ఈ క్రమంలోనే మరోసారి సచిన్ పై గుంజన్ గొడవకు దిగింది. దీంతో ఈ గొడవ కాస్త పెద్దగా మారింది. గొడవ జరుగుతున్న సమయంలో గుంజన్ క కిచెన్‌లోకి వెళ్లి కత్తిని తీసుకొచ్చి నేను పొడుచుకొని చనిపోతానని బెదిరించింది. దీంతో సచిన్ ఆగ్రహానికి లోనై గుంజన్ చేతిలో ఉన్న కత్తిని తీసుకోబోయాడు దీంతో ఆ కత్తి సచిన్ ఛాతిలో బలంగా దిగింది. దీంతో అక్కడే ఉన్న వారి కూతురు గట్టిగా అరిచింది. అప్పుడు వీరున్న ఫ్లాట్‌లోనే పైన ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న తన తమ్ముడు కిందికి వచ్చి చూసే సరికి తన అన్నయ్య సచిన్ రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. దీంతో షాక్ అయిన అతను వెంటనే సచిన్‌ను ఆసుపత్రికి తరలించారు. సచిన్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. ఈ ఘటనపై సచిన్ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ గొడవకు సాక్ష్యంగా వారి కూతురు ఉంది.

Advertisement

Next Story

Most Viewed