ఛీ..ఛీ.. ఇతడు కన్నతండ్రేనా..?

by srinivas |
ఛీ..ఛీ.. ఇతడు కన్నతండ్రేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్టణంలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. రక్షణగా ఉండాల్సిన తండ్రే కన్న కూతురిపై పలుమారు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ ఘటన స్థానిక రైల్వే న్యూకాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల బాలిక తండ్రి, నానమ్మ, తాతయ్యతో కలిసి ఉంటుంది. ఇటీవల తల్లి మరణించడంతో.. బాధ్యతగా చూసుకోవాల్సిన తండ్రే భక్షకుడయ్యాడు. కూతురికి మాయ మాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 5 నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తూ.. పాశవికంగా అత్యాచారం చేశాడు.

ఇటీవల బాలిక అనారోగ్యంపాలవ్వడంతో తండ్రే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని తేలడంతో షాక్ గురయ్యారు. వైద్యులు తండ్రిని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే వైద్యులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story