- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, పరకాల: పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. వాటర్ ట్యాంక్ పైకి వెళ్లడానికి ఏర్పరచిన దిమ్మెలు ఎప్పుడు కూలి కింద పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలన్న, క్లోరినేషన్ చేయాలన్న మున్సిపల్ సిబ్బంది వాటర్ ట్యాంక్ పైకి వెళ్లడానికి జంకుతున్నారు. దీంతో వాటర్ ట్యాంక్ క్లోరినేషన్ చేయకుండానే మంచినీటి సరఫరా చేస్తుండడంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పలు విమర్శలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ కింద సులబ్ కాంప్లెక్స్ తో పాటు పలువురు చిరువ్యాపారులు నిత్యం మసులుతూనే ఉంటారు. ఆ దిమ్మెల పెచ్చులు ఊడి ఎవరి మీదనైనా పడుతాయేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పరకాల పట్టణ వాసులు కోరుతున్నారు.