దండ అంటేనే దోపిడీ వ్యవస్థ కేరాఫ్ : రాష్ట్రప్రచార కార్యదర్శి ఆలేం కోటి

by Sridhar Babu |   ( Updated:2021-09-28 09:01:07.0  )
thudum-debba
X

దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో దండ రాధాకృష్ణ దండుపాళ్యం వ్యవహారం చేస్తున్నదని తుడుండెబ్బ రాష్ట్రప్రచార కార్యదర్శి ఆలేం కోటి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో దండ రాధాకృష్ణ బహుళ అంతస్తుల నిర్మాణం చేశాడని, అక్రమ ఇసుక దోపిడీలో ప్రధానపాత్ర ఉందని అన్నారు. మండలం లో వైన్ షాప్ సిండికేట్ దందాకు కీలక సూత్రధారి ఇతనేనని, ఇతని కనుసన్నుల్లోనే సిండికేట్ దందా జరుగుతోందని తెలిపారు. మండలంలో లేని వ్యాపారం అంటు లేదని ప్రతి రోజు సాయంత్రం కాగానే తన గుమస్తాను మండలం మీదకు పంపి ఇల్లీగల్ వసూళ్లు, రోజువారి చిట్టి వసూళ్ళు చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూలు చట్టాలను ఉల్లంఘిస్తూ పెట్రోల్ బంకుల నిర్వహణలో ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఆదివాసీల సంపదని దోచుకుతింటున్నాడని మండిపడ్డారు.

దండ అంటేనే దోపిడి వ్యవస్థ కేరాఫ్ అని పలికారు. కుదిరితే దందా.. లేకపోతే దండుపాళ్యం వ్యవహార చందంగా చేస్తున్నాడని ఈ సందర్భంగా తెలిపారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టు అవతారం ఎత్తి కార్మికులతో వెట్టి చాకిరి పనిచేపించుకొని వల్ల జీతాలను మింగేసి, కార్మికులను చావుదెబ్బతీశాడని మాట్లాడిన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు కంకర దందాలో దండనే అడ్డంగా దందా చేస్తూ అవినీతిగా కోట్లు సంపాదించాడని వ్యాఖ్యానించారు.

సర్వం ఏజెన్సీ సంపదను దోచుకున్న ఘనత దండనే అని పేర్కొన్నారు. ఏజెన్సీలో గిరిజనులకు తినటానికి తిండి లేదు.. ఉంటానికి ఇల్లు లేదు.. చేసుకోవడానికి పనిలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ఇంతదందా చేసే ఈదండని ఏజెన్సీ ప్రాంతం నుంచి తరిమికొట్టాలని గిరిజనులు, తుడుండెబ్బ నాయకులు సిద్ధంగా ఉండాలని కోరారు. భవిష్యత్తులో అన్ని సామాజిక వర్గాలు సహాయ సహకారాలు అందించి ఏజెన్సీ దోపిడి నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంఘానికి సంపూర్ణమద్దతు తెలపాలని ఆయన కోరారు. ప్రజలరక్తాన్ని పిండించి సొమ్ము చేసుకుంటున్న ఈదోపిడీ బడాబాబులపై ఆదాయ పన్నుశాఖ అధికారులపై, ఇంటిలిజెన్స్ అధికారులపై, సిఐడి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలుపై ఒత్తిడి చేసి ఈ దోపిడీ దారుడినీ ఎండగట్టుటకు గిరిజనులు, తుడుండెబ్బ నాయకులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed