- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్మపేట SBI బ్యాంక్.. మీ సేవల పట్ల మేము చింతిస్తున్నాం
దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో ఏ చిన్న పని కోసం వచ్చినా సిబ్బంది గంటల కొద్దీ వేచి ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుకు ప్రతీ రోజు వచ్చే కస్టమర్లను ఒకరకంగా, ఎప్పుడో ఒకసారి వచ్చే కస్టమర్‌కు ఒక రకంగా సేవలు అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు సమయపాలన ప్రకారం బ్యాంకు సేవలు 10 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. సిబ్బంది మాత్రం 10.30 తర్వాతే ఖాతాదారులకు సేవలు అందిస్తున్నారు. బ్యాంకు అకౌంట్ కేవైసీ చేయించుకుందామని వస్తే రోజుల కొలది బ్యాంకు చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇటీవల మద్యం దుకాణాలకు డిమాండ్ అండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయడానికి వచ్చిన వారిని సైతం ఇబ్బందులకు గురిచేశారని అంటున్నారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి బ్యాంకు సిబ్బంది తీరు మార్చుకునేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పానుగంటి లక్ష్మణ్ గౌడ్ : దమ్మపేట బ్రాంచ్ ఖాతాదారుడు
బ్యాంకులో ఏ పని కోసం వెళ్లిన ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తుంది. బ్యాంక్ సిబ్బందిని బ్రతిమిలాడిన తర్వాతే పనులు చేస్తున్నారు. బ్యాంక్ సర్వర్ పనిచేయడం లేదు, లాగిన్ అవడం లేదని సాకులు చెబుతున్నారు. ఇటీవల డిమాండ్ అండ్ డ్రాఫ్ట్ తీయడానికి బ్యాంకు చుట్టూ రెండు రోజులు తిరగాల్సి వచ్చింది. ఇప్పటికైనా కస్టమర్లను ఇబ్బందులకు గురి చేయకుండా పనులు వెంటనే అయ్యేలా చూడాలి.