- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కనుమూసిన ఆశా చిహ్నం..
– 103 ఏళ్ల వయసులో మరణించిన వెరా లిన్
– సెకండ్ వరల్డ్ వార్ టైమ్‌లో స్ఫూర్తినింపిన కళాకారిణి
– బ్రిటన్ శక్తివంతమైన మహిళగా గుర్తింపు
రెండో ప్రపంచయుద్ధ సమయంలో తన పాటతో బ్రిటిష్ దళాలకు స్ఫూర్తినిచ్చిన “ఫోర్సెస్ స్వీట్ హార్ట్” వెరా లిన్ మరణించారు. 103 ఏళ్ల లిన్.. ‘వి విల్ మీట్ ఎగైన్, ది వైట్ క్లిఫ్స్ ఆఫ్ డోవర్’ లాంటి సెంటిమెంట్ పాటలతో ప్రసిద్ధి చెందారు. చీకట్లో వెలుగులు నింపిన తన పాటలు.. కష్టంలో ధైర్యాన్ని నింపిన తన గానంతో.. ఆ దేశపు అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నిలిచారు. ప్రత్యర్థుల దాడి సమయంలో ఆశావాదంతో కూడిన తన మెసేజ్‌లు మిలియన్ సంఖ్యలో ఉన్న బ్రిటన్ ఇళ్లల్లో వినిపించాయి. వారిలో ధైర్యాన్ని నింపాయి.
బ్రిటన్ బెస్ట్ ఎంటర్‌టైనర్లలో ఒకరైన లిన్.. 1917 మార్చి 20న లండన్‌లో జన్మించారు. ప్లంబర్ కుమార్తె అయిన ‘లిన్’ అసలు పేరు వెరా మార్గరెట్ లించ్. ఏడేళ్ల వయసులోనే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టిన తను.. నర్తకిగా, గాయనిగా రాణిస్తుండడంతో 11 ఏళ్ల వయసులోనే చదువును వదిలేసింది. తన అమ్మమ్మ పేరును తనలో కలుపుకుని వెరా లిన్‌గా ప్రాచుర్యం పొందింది.
16 ఏళ్ల వయసులో సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన లిన్.. జర్మనీతో బ్రిటన్ యుద్ధ సమయంలో తన పాటతో నేషనల్ టానిక్‌గా నిలిచింది. ఆ టైమ్‌లో సైనిక దళాలను అలరిస్తూ.. ఆస్పత్రులు, సైన్య శిబిరాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. భారత్, బర్మా వరకు ప్రయాణించింది. శాంతి సమయంలో చాలా సక్సెస్ అయిన లిన్.. ఆఫ్ వైడార్ సేహెన్, స్వీట్ హార్ట్ సాంగ్‌తో అమెరికాలో ఎంటర్‌టైన్మెంట్ అందించిన తొలి బ్రిటన్ కళాకారిణిగా గుర్తించబడింది. తన పాటతో ఆహ్లాదాన్ని అందించడంలో ఎప్పుడూ రిటైర్మెంట్ పొందని వెరా లిన్.. అత్యంత వృద్ధురాలైన ఆర్టిస్ట్‌గా బ్రిటిష్ ఆల్బమ్ చార్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. రెండు వారాల క్రితం తన పుట్టినరోజున మెసేజ్ ఇచ్చిన లిన్.. కరోనా కష్ట సమయంలో జాయ్‌ఫుల్‌గా ఉండాలని పిలుపునిచ్చింది.
జాతి మరిచిపోలేని బ్రిటన్ ఐకాన్‌గా, నమ్మకానికి చిహ్నంగా గుర్తించబడిన లిన్.. తన 103వ ఏట మరణించారు. ఈస్ట్ సస్సెక్స్‌లోని డిచ్లింగ్‌లో నివాసముంటున్న ‘డేం వెరా లిన్’ మృతిపై కుటుంబం అధికారిక ప్రకటన చేయగా.. ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.