ఈటల సమాధానం చెప్పాలి.. దళిత బాధితులు ప్రశ్నల వర్షం

by Sridhar Babu |   ( Updated:2021-07-14 09:42:21.0  )
ఈటల సమాధానం చెప్పాలి..  దళిత బాధితులు ప్రశ్నల వర్షం
X

దిశ, హుజూరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో తన వల్ల ఇబ్బంది పడ్డ దళితులకు ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని ఈటల దళిత బాధితుల సంఘం నాయకులు తిప్పారపు సంపత్ అన్నారు. బుధవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారని, దళితులకు ఆయన ఇచ్చిన మాట ఏం నిలబెట్టుకున్నారో సమాధానం చెప్పాలని కోరారు. పాదయాత్ర మొదలు పెట్టిన రోజే తమ సంఘం ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరుగుతుందన్నారు.

జమ్మికుంటలో చెప్పుల ఫ్యాక్టరీ ప్రభుత్వం మంజూరు చేసినా.. ఈటల రాజేందర్ పట్టించుకోలేదన్నారు. దళితులకు అవసరమా అని చెప్పిన ఆయన.. 45 వేల మంది దళితుల ఓట్లు ఇక్కడ ఉండడంతో పాదయాత్రకు ముందుకు వస్తున్నారన్నారు. సమాధానం చెప్పకుండా పాదయాత్ర చేస్తే అడ్డుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఈటల దళిత బాధితుల సంఘం సభ్యులు సునీత, భారతి, జానీ, రాజేశ్వర్, ప్రవీణ్ ,రమేష్, రాజు, లక్ష్మి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story