కొటేషన్ల కోసం లబ్దిదారులకు తప్పని తిప్పలు..

by Sridhar Babu |
కొటేషన్ల కోసం లబ్దిదారులకు తప్పని తిప్పలు..
X

దిశ, హుజురాబాద్ రూరల్ : ఎన్నికల షెడ్యూల్ రావడం ఏమో కానీ దళిత బంధు లబ్దిదారులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వం కేటాయించిన రూ.10 లక్షల సాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగక తప్పని పరిస్థితి ఎదురైంది వారికి. ఇంటికి వచ్చి సర్వే చేసిన అధికారులు తమకు యూనిట్ అప్పగించే వరకూ అదే పద్దతిన వ్యవహరిస్తారనుకున్నప్పటికీ చివరి క్షణంలో ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేయకతప్పని పరిస్థితి తయారైంది.

వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొటేషన్లు ఇచ్చేందుకు టాటా కంపెనీ ప్రతినిధులను ప్రత్యేకంగా పిలిపించారు అధికారులు. లబ్దిదారులు తమ వాహనాలకు సంబంధించిన కొటేషన్లు తీసుకునేందుకు సంబంధిత కార్యాలయాలకు రావాలని కోరారు. హుజురాబాద్ పట్టణ పరిధిలోని లబ్దిదారులకు మునిసిపల్ ఆఫీసులో, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి ఎంపీడీఓ కార్యాలయంలో కొటేషన్లు ఇచ్చేందుకు పలు ఏర్పాట్లు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వచ్చిన లబ్దిదారులు ఆయా కార్యాలయల వద్దకు చేరుకున్నారు. ఉదయం నుండి ఈ రెండు ఆఫీసుల ముందు దళితులు పెద్ద ఎత్తున చేరుకుని కొటేషన్లు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story