- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SBI బ్యాంకు ఎదుట దళితబంధు లబ్దిదారుల ఆందోళన..
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఎదుట దళితులు ఆందోళనకు దిగారు. తమ అకౌంట్లలో నగదు జమ అయిందో లేదోనని తెలుసుకునేందుకు బ్యాంకుకు వచ్చిన వేలాది మంది లబ్దిదారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండి బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వృద్దురాలు 10.30 గంటల నుండి బ్యాంకు ముందు క్యూ లైన్‌లో ఉండి కొద్దిసేపటి కిందట హెల్ప్ డెస్క్ వద్దకు వెళ్లి ఆరాతీయగా ఆమె అకౌంట్లో డబ్బులు జమ కాలేదని తెలుసుకుని కన్నీటి పర్యంతమైంది.
ఈ విషయాన్ని గమనించిన దళితులు ఆందోళనకు దిగారు. బ్యాంకు ముందు కూర్చుని నిరసన తెలిపారు. లబ్దిదారుల అవసరాలకు అనుగుణంగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయలేదని దీంతో గంటల తరబడి బ్యాంకు ముందు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి ఇందులో ఒకటి వృద్దుల కోసం కేటాయించాలని లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో ఆందోళన కాస్త సర్దుమణిగింది.