మోత్కుపల్లి జోస్యం నిజం కాబోతుందా..?

by Shyam |   ( Updated:2021-08-06 06:45:37.0  )
etala-vs-motkupalli
X

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఎదురీత తప్పదని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు జోస్యం చెప్పారు. దళిత బంధు పథకం నియోజకవర్గంలో అమలైతే దళితులు ఈటలకు ఓటు వేయరని వెల్లడించారు. దళితుల భూములు ఆక్రమించుకున్న ఈటలకు ఓటమి తప్పదని, వారంతా తిరిగి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు. ఆలయ భూములు ఆక్రమించుకున్న ఈటల రాజేందర్‌కు దళితులు ఓట్లు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story