- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. హుజురాబాద్‌లో దళిత బంధు సర్వే స్టార్ట్
దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్‌లో శుక్రవారం అధికారులు సర్వే ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను జిల్లా కలెక్టర్ కర్ణన్ జిల్లా యంత్రాంగానికి అందజేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 200 మంది వివిధ శాఖల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. మొత్తం 48 అంశాలపై దళిత కుటుంబాల నుంచి సేకరించాల్సి ఉంది. ఐదు రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.
బ్యాంకర్లు సర్వేలో ఉంటారు
దళిత బంధు సర్వేలో రెవెన్యూ అధికారులకు తోడుగా బ్యాంకు అధికారులు కూడా పాల్గొంటారని హుజురాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు సపోర్టింగ్ ఆఫీసర్లతో పాటు బ్యాంకు అధికారులు కూడా సర్వేకు హాజరవుతున్నారని వివరించారు. దళితులు సర్వే ద్వారా వివరించే అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి ఏ స్కీం వర్తిస్తుంది.. వాటి వల్ల వారి కుటుంబాలకు కలిగే ఆదాయం తదితర వివరాలను కూడా తెలియజేస్తామని చెప్పారు. ఈ పైలెట్ ప్రాజెక్టు సర్వేను దళితులు, అధికారులు విజయవంతం చేయాలని ఆర్డీఓ కోరారు. -ఆర్డీవో రవీందర్ రెడ్డి