‘కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే దళిత బంధు’

by Shyam |   ( Updated:2021-08-16 09:55:52.0  )
ramulu nayak
X

దిశ‌, నర్సాపూర్ : కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. సోమవారం నాడు నర్సాపూర్ పట్టణంలోని ఐబీ న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యక‌ర్తల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి రాములు నాయ‌క్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు ప‌థ‌కాలు గుర్తుకు వ‌స్తాయ‌ని ఆ త‌ర్వాత మ‌ర‌చిపోవ‌డం ప‌రిపాటిగా మారింద‌ని అన్నారు. ముఖ్యమంత్రికి ద‌ళితుల మీద ఎలాంటి ప్రేమ లేద‌ని కేవ‌లం హుజురాబాద్ ఎన్నిక‌ల కోస‌మే ఆ ప‌థ‌కం తీసుకొచ్చార‌ని విమ‌ర్శించారు.

దళిత బంధు పథకం మాదిరిగానే ఎస్టీ బంధు, బీసీ బంధు ఇతర బంధులు ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని కోరారు. రాష్ట్రం బంగారు తెలంగాణ పేరుతో కుటుంబ పాల‌న సాగుతుంద‌ని ఆరోపించారు. కాగా న‌ర్సాపూర్ నియోజ‌క‌వ్గంలో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం కోసం ప్రతి కార్యక‌ర్త ప‌ని చేయాల‌ని కోరారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మ‌హిళా విభాగం త‌దిత‌ర క‌మిటీలు వేసుకోవాల‌ని సూచించారు. అనంత‌రం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను శాలువాతో ఘ‌నంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంజ‌నేయులు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మ‌ల్లేశం, శ్రీ‌నివాస్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story