క్వారంటైన్‌కు డికాక్ అయితే బెటర్: స్టెయిన్

by Shyam |
క్వారంటైన్‌కు డికాక్ అయితే బెటర్: స్టెయిన్
X

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాకు వచ్చే వారికి కూడా అక్కడి ప్రభుత్వం క్వారంటైన్ శిబిరాలకు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ఒక క్రీడా వెబ్‌‌సైట్‌తో మాట్లాడుతూ క్వారంటైన్‌పై సరదా వ్యాఖ్యలు చేశాడు.

క్వారంటైన్‌లో తనను సఫారీ కెప్టెన్ క్వింటన్ డీకాక్‌తో పాటు ఉంచితే హాయిగా ఉండిపోతానని అన్నాడు. ఎందుకంటే డీకాక్ మంచి వంటగాడని.. అతడి అద్భుతమైన వంటలు రుచిచూసుకుంటూ ఎన్నిరోజులైనా గడిపేయవచ్చని అన్నాడు స్పీడ్‌స్టర్. అంతేకాదు ప్రపంచంలో తాను అత్యంత ఎక్కువగా ఇష్టపడే వ్యక్తుల్లో డీకాక్ ఒకడని అన్నాడు. ఎప్పుడైనా తన హోటల్ రూంలోకి వెళ్తే.. డీకాక్ చేపలు పట్టేందుకు తన గాలాన్ని రెడీ చేసుకోవడమో లేదా చేపలు పట్టే వీడియోలో చూస్తూ ఉంటాడని.. ఇవి రెండూ కాకపోతే యూట్యూబ్‌లో వంటల వీడియోలు చూస్తుంటాడని డేల్ చెప్పాడు.

Tags : South Africa, Quinton De kock, dale steyn, Quarantine, Good chef

Advertisement

Next Story