బీపీపీ కార్మికులకు నిత్యవసరాల అందజేత

by Shyam |
బీపీపీ కార్మికులకు నిత్యవసరాల అందజేత
X

దిశ, న్యూస్ బ్యూరో: బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ)లో పనిచేస్తున్న గార్డెనింగ్ వర్కర్లు, సెక్యూరిటీ సిబ్బందికి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ బుధవారం నిత్యవసరాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలోనూ వారంతా గ్రీనరీని కాపాడేందుకు పనిచేస్తున్నారని అభినందించారు. ఒక్కొక్కరికి బియ్యం, కిలో పప్పు, లీటర్ నూనె పాకెట్, గోధుమ పిండి, కారం పొడి కలిపి రూ.వెయ్యి విలువైన వస్తువలను అందజేశారు. వీరంతా లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో బీపీపీ ఓఎస్డీ సంతోష్ పాల్గొన్నారు.

tags : BPP workers, HMDA commissioner, OSD santhosh, Lumbini park

Advertisement

Next Story

Most Viewed