- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ కుబేరుల జాబితాలో D-Mart అధినేత
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, బిలియనీర్ రాధాకిషన్ దమానీ ప్రపంచ అత్యంత కుబేరుల జాబితా 100లో చోటు దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్ తాజా నివేదిక ప్రకారం.. D-Mart అధినేత రాధాకిషన్ దమానీ ఈ జాబితాలో 97వ స్థానానికి చేరుకున్నారు. ఈ మధ్య కాలంలో రాధాకిషన్‌కు చెందిన పోర్ట్‌ఫోలియోలో పలు కంపెనీలు భారీగా ఆదాయాన్ని అందించాయి. దీంతో ఆయన సంపద 19.3 బిలియన్ డాలర్ల(రూ. 1.43 లక్షల కోట్ల)కు చేరుకుంది. కేవలం ఈ ఏడాదిలో మాత్రమే ఆయన సంపద 4 బిలియన్ డాలర్ల(రూ. 30 వేల కోట్ల)కు పైగా పెరిగింది.
ఈ కారణంగా ఆయన ప్రపంచ టాప్ 100 కుబేరుల జాబితాలో చోటు సంపాదించినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక వివరించింది. రాధాకిషన్ దమానీకి ప్రధాన ఆదాయం డిమార్ట్ నుంచే వస్తుంది. డీమార్ట్‌కు ప్రధాన ప్రమోటర్‌గా ఉండటంతో ఇటీవల డిమార్ట్ షేర్ల విలువ భారీగా పెరిగిపోయింది. డీమార్ట్‌లో ఆయనకు 65 శాతానికి పైగా వాటా ఉంది. ఈ ఏడాది జనవరిలో కంపెనీ షేర్ ధర రూ. 2,789 ఉండగా, ఈ నెలలో ఏకంగా 31 శాతం పెరిగి రూ. 3,649కి చేరుకుంది. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్ల తాజా జాబితా ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అజీమ్ ప్రేమ్‌జీ, శివ్ నాడార్, లక్ష్మి మిట్టర్ ఈ జాబితాలో ఉన్నారు.