- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం జగన్ కోసం.. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర
దిశ, రాయలసీమ : సీఎం జగన్ కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన పడారి రమేష్‌ను ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభినందించారు. మంగళవారం తుమ్మలగుంటకు చేరుకున్న రమేష్‌ను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి కశ్మీర్ నుంచి తిరుపతికి 5,265 కిలోమీటర్ల దూరాన్ని 62 రోజుల్లో ప్రయాణించిన పడాల రమేష్ సంకల్పించడాన్ని కొనియాడారు. ఈ సైకిల్ యాత్ర సజావుగా సాగేందుకు కడప జిల్లా బద్వేల్‌కు చెందిన కత్తెరపల్లి శ్రీనివాసులు రెడ్డి సహకారం అందించడాన్ని అభినందించారు. మరో ఏడు రోజుల్లో కన్యాకుమారికి చేరుకోనున్ననట్లు పడాల రమేష్ పేర్కొన్నారు. కాగా, జగన్ ముఖ్యమంత్రి అయితే తాను కశ్మీర్ టు కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేస్తానని అప్పట్లో నిర్ణయం తీసుకున్నానని, కానీ అనివార్య కారణాలతో చేయలేక పోయానని రమేష్ తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో యాత్ర చేస్తున్నట్లు వివరించాడు.