- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ నేరాల నిరోధానికి ‘దిల్ సే’..
దిశ, క్రైమ్ బ్యూరో : సమాజంలో సైబర్ వారియర్స్‌ను నిర్మించడం ద్వారానే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఇటీవల కోవిడ్ నేపథ్యంలో సైబర్ నేరాలతో పాటు పలు రకాల ఆర్థిక నేరాలు దాదాపుగా 250 శాతం పెరగడంతో ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్ లో యువత సురక్షితమైన పద్దతులను అవలంభించేందుకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిల్ సే విభాగం లోగో, బ్రోచర్ ను గచ్చిబౌలిలో సీపీ సజ్జనార్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుతం సాంప్రదాయ నేరాలు తగ్గుతూ.. సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో డిజిటల్ అక్షరాస్యత పట్ల అవశ్యకత ఉందన్నారు.
నేరాలను ఎదుర్కోవడం, ప్రజలకు ఉత్తమ మార్గాల పట్ల అవగాహన కల్పించడం వంటి అంశాలపై శిక్షణ చాలా అవసరం ఉందన్నారు. ప్రజలు కొత్త నేరాల గురించి తెలుసుకున్నప్పుడు పోలీసులతో షేర్ చేసుకోవాలన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ద్వారా ఇప్పటికే ట్రాఫిక్ సేవలు 2 వేలు, మార్గదర్శక్ లో 300 మంది, సంఘమిత్రలో 300 మంది, బాల మిత్రలో 6 వేల మంది ఉపాధ్యాయులు వాలంటీర్లుగా పనిచేస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి 6న మొదటి బ్యాచ్ లో 100 మంది యువకులు శిక్షణ పొందనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల, హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రెజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్, ఎండ్ నౌ వ్యవస్థాపకులు అనిల్ రాచమల్ల తదితరులు పాల్గొన్నారు.