- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్మా దానం చేయండి.. కరోనా బాధితులను ఆదుకోండి
దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనా వైరస్ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. కొవిడ్ -19 నుంచి కోలుకున్నవారంతా ప్లాస్మా దానం చేసి బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లడుతూ కరోనా వైరస్ బారిన పడితే రోగుల రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ప్లాస్మా దానం చేయడం కారణంగా ఇద్దరు వ్యక్తులను రక్షించిన వాళ్ళం అవుతామన్నారు. దానం చేసిన 500ఎంఎల్ ప్లాస్మా తిరిగి 24గంటల నుంచి 72 గంటల్లోగా ఉత్తత్తి అవుతోందని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు వీరశేఖర్, వెంకటేష్‌లు ప్లాస్మా దానం చేసి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్లాస్మా దానం చేయాలనుకున్న వారు సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ నెంబరు 94906 17440 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.