మొక్కలు నాటడం నిరంతర ప్రక్రియ: సీపీ సజ్జనార్

by Shyam |
మొక్కలు నాటడం నిరంతర ప్రక్రియ: సీపీ సజ్జనార్
X

పర్యావరణ హితం, మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో సీపీ సజ్జనార్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలను నాటాలని సూచించారు. నాటిన తర్వాత కనీసం మూడు నెలలైనా సంరక్షించాలని కోరారు. అలాగే మరో ముగ్గురికి మొక్కలను నాటాలని ప్రతిపాదించాలన్నారు. మొక్కలు నాటడం అనేది ఒక నిరంతర ప్రక్రియ కావాలని ఆకాంక్షించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశంలోని అన్నిమూలలకు వ్యాపించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ, డీసీపీ అనసూయ, అదనపు డీసీపీలు కవిత, మాణిక్‌రాజ్, ఏసీపీలు లక్ష్మీనారాయణ, సంతోష్‌కుమార్, ఆర్ఐలు మట్టయ్య, హిమకర్, విష్ణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed