క్యాష్‌ బ్యాక్ ఆఫర్ పేరిట మోసం

by Shyam |
క్యాష్‌ బ్యాక్ ఆఫర్ పేరిట మోసం
X

హైదరాబాద్: ఫోన్ పే కు క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చిందంటూ ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బషీర్‌బాగ్‌కు చెందిన సర్వేష్ జైస్వాల్ అనే వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీకు ఫోన్ పే లో క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చిందని, వెంటనే ఓపెన్ చేసి చూడాలని చెప్పారు. దీంతో వ్యాపారి ఫోన్ పే ఓపెన్ చేసి మెసేజ్ చదవకుండానే క్లిక్ చేశాడు. అలా క్లిక్ చేసిన కొద్దిసేపటికే ఖాతా నుంచి రూ.59 వేలు మాయం అయ్యాయి. దీంతో బాధిత వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags : Cyber ​​criminals, cheated, merchant, cash back, phone pay, basheerbagh

Advertisement

Next Story