వేతనాల్లో కోత అసమంజసం

by Shyam |
వేతనాల్లో కోత అసమంజసం
X

దిశ, ముషీరాబాద్: రాష్ట్రంలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులందరికీ నవంబర్ నెల వేతనాల్లో ఒకరోజు వేతనాన్ని కోత విధించి ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇవ్వటాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. జేఏసీ పేరుతో ఐక్య వేదిక భాగస్వామ్య సంఘాలను సంప్రదించకుండా టీఎన్‌జీవో, టీజీవో సంఘాల నాయకులు ఏకపక్షంగా విరాళం ప్రకటించడం సరికాదని తెలిపింది. వారు ప్రకటించిన లేఖ ఆధారంగా బలవంతంగా ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టడానికి వీలు లేదని తెలిపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల అంగీకారంతోనే వేతనంలో కోత విధించాలనీ డీడీవోలను ఆదేశించాలని అని కోరుతూ అక్టోబర్ 22న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కి మెమోరాండం సమర్పించినట్టు సంఘం తెలిపింది. దాన్ని విస్మరించి ఆర్థిక శాఖ అంగీకారంతో నిమిత్తం లేకుండా ఉద్యోగులందరి వేతనాల్లో కోత విధించాలని ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. విరాళం ఇవ్వడానికి అంగీకరించిన, లేఖ ఇచ్చిన సంఘాల సభ్యుల నుండి మాత్రమే ఒకరోజు వేతనం కోత పెట్టేలా డీడీవోలను ఆదేశిస్తూ సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని ఐక్యవేదిక నాయకులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.

Advertisement

Next Story