- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిప్ ఇచ్చి షాక్ ఇచ్చాడు..!
దిశ, వెబ్‌డెస్క్: మీరు రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత సర్వ్ చేసిన వెయిటర్‌కు టిప్ ఎంత ఇస్తారు? మహా అయితే వంద లేదా రెండు వందలు, కొంచెం రిచ్ అయితే ఓ ఐదొందలు ఇస్తారు కావచ్చు. కానీ, యూఎస్‌లోని ఓ రెస్టారెంట్ వెయిట్రెస్‌కు కస్టమర్ అక్షరాల రూ.3.68 లక్షల టిప్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. సదరు రెస్టారెంట్ నిర్వాహకులు ఆ టిప్ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది.
కొవిడ్ పాండమిక్ సమయంలో చతికిలపడ్డ రెస్టారెంట్లు లాక్‌డౌన్ అనంతరం పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ పెన్‌సైల్వనియలోని ఇటాలియన్ రెస్టారెంట్ వెయిటర్‌కు భారీ మొత్తంలో టిప్ అందుకొని వార్తల్లో నిలిచింది. డిసెంబర్ 12న రెస్టారెంట్‌కు వచ్చిన ఓ కస్టమర్‌కు నార్మల్‌గా అందరికీ సర్వ్ చేసినట్లుగానే ఓ వెయిట్రెస్.. ఆర్డర్ ప్రకారం ఫుడ్ సర్వ్ చేసింది. అనంతరం వినియోగదారుడు వెయిట్రెస్‌కు ఫుడ్ బిల్లుతో పాటు టిప్ కూడా ఇచ్చాడు. అయితే బిల్లు 205 డాలర్లు(రూ.15,170) ఉండగా, టిప్ మాత్రం 500 డాలర్లు (రూ.3.68 లక్షలు) చెల్లించాడు. దాంతో ఆ బిల్లును రెస్టారెంట్ నిర్వాహకులు ఫేస్‌బుక్‌లో ఆంథోనిస్ పాక్సన్ హాలో పేజీలో షేర్ చేశారు.
‘మీకు చెప్పడానికి మా దగ్గర థాంక్యూ తప్ప వేరే పదాలు ఏవీ లేవు. ఇది మా స్టాఫ్‌కు చాలా ఉపయోగపడుతుంది. థాంక్యూ.. థాంక్యూ.. థాంక్యూ’ అనే వ్యాఖ్యలకు జతగా బిల్లు ఫొటో కూడా పోస్ట్ చేశారు. ఇన్ని రోజులు సెలవులు తీసుకున్న తమ స్టాఫ్‌కు ఈ టిప్ సహాయపడుతుందని, మేము మిమ్మల్ని ప్రేమిస్తాం, అభినందిస్తాం, మా దగ్గర ఉత్తమమైన సమాజముందని భావిస్తామని అందులో పేర్కొన్నారు. కాగా ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. కొవిడ్ అనంతర విపత్కర పరిస్థితుల్లో.. నమ్మశక్యం కాని, ఓ అద్భుతమైన బహుమతి ఇచ్చాడని, ఆయన ఉదారత గొప్పదని ఓ నెటిజన్ అన్నాడు. ప్రపంచంలో ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారని చెప్పేందుకు ఈయన నిదర్శనమని మరొక నెటిజన్ తెలిపాడు. కాగా, టిప్ ఇచ్చిన ఆ కస్టమర్‌కు సర్వ్ చేసిన జియాన్న డిఅంజెలో నర్సింగ్ చదువుతూ పార్ట్ టైమ్‌గా రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. ఈ టిప్ తన యూనివర్సిటీ ఖర్చులకు ఉపయోగపడుతాయని ఆమె పేర్కొంది.