కరివేపాకు జ్యూస్‌తో బోలెడు ప్రయోజనాలు..

by sudharani |
కరివేపాకు జ్యూస్‌తో బోలెడు ప్రయోజనాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: కరివేపాకును వంటిట్లో విరివిగా వాడుతుంటారు. కరివేపాకు, కొత్తిమీర ఇవి లేకుండా వంటలు ప్రీపేర్ చేయడం చాలా అరుదు. అయితే, కొందరు కూరలు, టిఫిన్స్‌లో వచ్చే కరివేపాకును తినకుండా పక్కన పెడుతారు. వీటిని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇకమీదట ఎవరూ అలా చేయరు. దశాబ్ద కాలం కిందటి వరకు కరివేపాకు (Curry Leaves)ను వంటల్లో ఎక్కువగా వాడేవారు. కానీ, ఇప్పటి తరం కరివేపాకు, కొత్తిమీర లాంటి ఆకుకూరలను అంతగా తినడం లేదు. వాటి వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. కరివేపాకు తినడం ఇష్టపడని వారు జ్యూస్ పట్టుకొని అయినా తాగొచ్చు.

తయారీ విధానం..

కరివేపాకు జ్యూస్ తయారు చేసేందుకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. తాజా, శుభ్రం చేసిన కరివేపాకులను గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే కరివేపాకు ఆకులను మెత్తగా దంచినా పరవాలేదు. గ్రైండర్ లేనివారు ఒక గిన్నెలో వాటర్ పోసి కరివేపాకులను వేయాలి. గ్యాస్ మీద పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆకులు గోధుమ రంగులోకి మారాక నీటిని వడపోసి వేరుచేసుకోవాలి. అలా చేసినా కరివేపాకు జ్యూస్ రెడీ అవుతుంది.

కరివేపాకు జ్యూస్ వలన కలిగే ప్రయోజనాలు..

1. కరివేపాకు జ్యూస్ రెగ్యూలర్‌గా తీసుకోవడం బాడీ డిటాక్స్ అవుతుంది. అంటే కొన్నిసార్లు కడుపులో తిప్పడం, వికారం లాంటివి కాకుండా ఇది బాగా పనిచేస్తుంది.

2. కొవ్వు కరిగించడంలోనూ కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. కొవ్వు వలన రక్తం సరఫరా జరగదు. అలాంటప్పుడు కరివేపాకు తింటే మీ ఆరోగ్యానికి ప్లస్ పాయింట్ అవుతుంది.

3. అతి వేగంగా తినేవారికి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అప్పుడు కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది.
జీర్ణక్రియ సరిగా జరిగి సమయానికి ఆకలి అవుతుంది. వేళకు ఆహారం తింటే ఆరోగ్యం మీ సొంతం.

4. కరివేపాకును వంటల్లో వాడతారు. కానీ కొందరు తినడకుండా పడవేస్తుంటారు. అయితే కరివేపాకు తినడం ఇబ్బందిగా ఉంటే జ్యూస్ చేసుకుని తాగడం మంచిది. సులువుగా తాగేయవచ్చు. దీనివల్ల పోషకాలు, విటమిన్లు సులువుగా రక్తంలోకి చేరతాయి.

5. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ తగ్గడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకు తగ్గ శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది.

6. ఇంకో ముఖ్యమైన విషయం ఎంటంటే.. కరివేపాకు తినడం, జ్యూస్ తాగడం వలన జుట్టు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.

Advertisement

Next Story

Most Viewed