- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరెంట్ అఫైర్స్: జాతీయం-అంతర్జాతీయం
అంతర్జాతీయం:
ఐరాస కార్యాలయంలో గాంధీ విగ్రహావిష్కరణ:
హింస, ఘర్షణలు.. వంటి వివిధ రకాల సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రపంచంలో.. శాంతి, సుస్థిరత నెలకొనడానికి మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దోహదం చేస్తాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.
ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తో కలిసి ఆయన ఐరాస కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
దీనిని భారతదేశం ఐరాసకు బహుమతిగా పంపింది.
ఐరాసలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
జాతీయం:
మధ్యవర్తిత్వ కేంద్రం పేరు మార్పు:
వివాదాల పరిష్కార వేదికలకు భారతదేశం ముఖ్య స్థావరంగా మారనుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
'న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్' పేరును 'ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్' గా మార్చే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు.
ఈ బిల్లును లోక్‌సభ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించగా, ఎగువసభ సమ్మతి తెలిపింది.
ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం:
జాతీయ రాజకీయాల దిశగా భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) తొలి అడుగు వేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
సర్దార్ పటేల్ మార్గ్ లోని కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
పార్టీ అనుబంధ రైతు సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితిని ప్రకటించారు.
దీనికి అధ్యక్షుడిగా హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లా జట్టావ్ గ్రామానికి చెందిన రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చడూనీ, కార్యాలయ కార్యదర్శిగా రవి కొహాడ్‌లను నియమించారు.
2022-23 లో భారత వృద్ధి 6.9 శాతం:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు మళ్లీ పెంచింది.
జీడీపీ వృద్ధి 6.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
అంతర్జాతీయ కుదుపుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందని బ్యాంకు తెలిపింది.
రెండో త్రైమాసిక వృద్ధి రేటు అంచనాలను మించి నమోదు కావడం వృద్ధి అంచనాలను సవరించడానికి కారణమైనట్లు పేర్కొంది.
6వ వందే భారత్ రైలు ప్రారంభం:
ప్రధాని నరేంద్ర మోడీ బిలాస్‌పూర్ (చత్తీస్ గఢ్) - నాగపూర్ (మహారాష్ట్ర)ల మధ్య వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
ముంబై - అహ్మదాబాద్ తర్వాత ఈ రాష్ట్రంలో రెండో రైలు ఇది.
మొత్తం మీద 6వ వందే భారత్ రైలు ప్రారంభమైంది.
అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ విజయవంతం
భారత్ గురువారం అణు సామర్ధ్య బాలిస్టిక్ మిసైల్ అగ్ని-5 ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసింది.
ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
భారత స్వీయ రక్షణ వ్యవస్థకు కీలకమైన ప్రయోగమని, నిర్దేశిత 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుందని తెలిపారు.
అధునాతన సాంకేతిక పరికరాలతో మిసైల్ మరింత తేలికగా రూపొందించినట్లు పేర్కొన్నారు.
సరిహద్దుల్లో చైనా రెచ్చగొట్టే ప్రయత్నాల నేపథ్యంలో ఈ ట్రయల్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
షెడ్యూల్ కన్నా ముందే ఈ ప్రయోగం చేపట్టడం గమనార్హం.
గత ఏడాది భారత్ అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రయోగంపై చైనా ఆందోళనలు లేవనెత్తింది.