- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (Upsc,Appsc,Tspsc.. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్)
అమెరికా సహాయ మంత్రిగా భారత సంతతి వ్యక్తి రవి చౌదరి:
అమెరికా రక్షణ శాఖలో వైమానిక దళానికి సహాయ మంత్రిగా భారత సంతతికి చెందిన రవి చౌదరి నియామకాన్ని అమెరికన్ పార్లమెంట్ ఎగువ సభ సెనెట్ ధ్రువీకరించింది. రవి చౌదరి నియామకానికి అనుకూలంగా ఓటు వేసిన వారిలో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన 12 మంది సెనేటర్లు ఉన్నారు.
నేపాల్ అధ్యక్షుడిగా రామ్ చంద్ర ప్రమాణం:
సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రామ్ చంద్ర పౌడెల్ ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరికృష్ణ కార్కి రామ్ చంద్ర పౌడెల్ చేత ప్రమాణం చేయించారు.
ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవం:
సాంకేతికతను అందిపుచ్చుకుని నౌకాదళం మరింత బలోపేతమవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. కొచ్చిలో ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవ పురస్కారం రాష్ట్రపతి పతకాన్ని ఆమె అందించారు. దేశ వ్యూహాత్మక, మిలిటరీ, ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల్లో నౌకా దళం అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
బిపిన్ రావత్ పేరిట అవార్డులు:
దివంగత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సంస్మరణార్థం రెండు అవార్డులను ఏర్పాటు చేయనున్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది.
ఇందులో మొదటిది శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన మహిళా అగ్నివీర్ ట్రైనీకి ఇవ్వనున్నట్లు తెలిపింది.
రెండో పురస్కారాన్ని గోవాలోని నేవల్ వార్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్స్ శిక్షణ పొందుతున్న వారిలో అత్యుత్తమ ప్రతిభ చాటిన అధికారికి ప్రదానం చేయనున్నట్లు తెలిపింది.
ఏపీ బడ్జెట్ రూ. 2,79,279.27 కోట్లు:
విధాన పరమైన ఆవిష్కరణలు, వినూత్న పాలనా విధానాలు తమ ప్రభుత్వ విశిష్ట లక్షణాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. నవరత్నాలు, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న పథకాల ఆధారంగా రూపొందించిన అభివృద్ధి సాధన కోసం ఒక సమ్మిళిత విధానాన్ని తమ ప్రభుత్వం అవలంబించిందని పేర్కొన్నారు.
ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా రూ. 1.97 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిందని, ఈ విధానం, సంక్షేమ కార్యక్రమాల అమలులో అద్భుతమైన నమూనాగా నిలిచిందని అన్నారు.
ఏపీ బడ్జెట్ హైలైట్స్:
రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు
ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.21,434.72కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020కోట్లు
జగనన్న విద్యా దీవెన రూ.2,841.64కోట్లు
జగనన్న వసతి దీవెన రూ.2,200కోట్లు
వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1,600కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.వెయ్యి కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు
జగనన్న చేదోడు రూ.350 కోట్లు
వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు
రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు
లా నేస్తం రూ.17 కోట్లు
జగనన్న తోడు రూ.35 కోట్లు
ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు
వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు
వైఎస్సార్ చేయూత రూ.5వేల కోట్లు
అమ్మ ఒడి రూ.6,500కోట్లు
డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు
మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు
యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు
వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు
కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్) రూ.11,908 కోట్లు
పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు
ఎనర్జీ రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖకి రూ.3,858 కోట్లు
గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
2023-2024 బడ్జెట్ అంచనా రూ.2,79,279