- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్.. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ - ఏప్రిల్ 8, 2023
దిశ, కెరీర్: ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల ఫుట్ బాల్ జట్టు స్థానం మెరుగైంది. ప్రకటించిన జాబితాలోని 5 స్థానాలు ఎగబాకిన భారత్ 101వ ర్యాంకు సాధించింది.మరో స్థానం మెరుగైతే భారత్ టాప్ 100 లోకి వస్తుంది. 1996 లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 100వ, కెన్యా 102వ స్థానాల్లో ఉన్నాయి. అర్జెంటీనా, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, క్రొయేషియా, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ వరుసగా తొలి పది ర్యాంకులు సాధించాయి.
జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడిగా కలికేశ్
కలికేశ్ నారాయణ్ సింగ్ దేవ్ భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పటికే పదవీ కాలం ముగిసిన ప్రస్తుత అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ సుదీర్ఘ సెలవుల్లోకి వెళ్లడంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న కలికేశ్ అధ్యక్ష విధులు నిర్వర్తించనున్నాడు.
ధోనీకి ఎంసీసీ జీవితకాల సభ్యత్వం
ప్రతిష్టాత్మక మారిలోబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ ధోని సహా 5గురు భారత క్రికెటర్లకు జీవితకాల సభ్యత్వం ఇచ్చింది. ఈ సభ్యత్వం గతంలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, మిథాలి రాజ్, జులన్ గోస్వామీలకు ఇచ్చింది. ఎనిమిది టెస్ట్ దేశాల నుంచి మొత్తం 19 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది.
గిల్‌కు కెరీర్ అత్యుత్తమ ర్యాంకు
టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఐసీసీ విడుదల చేసిన బ్యాటింగ్ జాబితాలో గిల్ నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ 6, రోహిత్ శర్మ 8వ స్థానాలు సాధించారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ మూడో స్థానంలో ఉన్నాడు. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్ లో సూర్య కుమార్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. టీ20 ఆల్ రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా రెండో ర్యాంకు సాధించాడు.
ఏటీపీ ర్యాంకింగ్స్ లో నెం.1 గా జకోవిచ్
ఏటీపీ ర్యాంకింగ్స్ లో అల్కరాస్ ను వెనక్కి నెట్టి నొవాక్ జకోవిచ్ (7160 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఇండియన్ వెల్స్ టోర్నీలో విజేతగా నిలిచి నెం.1 దక్కించుకున్న అల్కరాస్, మియామి ఓపెన్లో సెమీ ఫైనల్లోనే ఓడడం తో తన ర్యాంకు చేజారింది. గతేడాది గాయాల కారణంగా టోర్నీలకు దూరమైన రఫెల్ నాదల్ 14 వ ర్యాంకుకు పడిపోయాడు.
ఏటీపీ ర్యాంకింగ్స్:
1. నొవాక్ జకోవిచ్
2. అల్కరాస్
3. సిట్సిపాస్
4. మెద్వెదెవ్
5. కాస్పర్ రూడ్
స్పేస్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం:
ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచే రీతిలో రూపొందించిన భారత అంతరిక్ష విధానం - 2023 కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆధునిక అంతరిక్ష సాంకేతికతలపై ఇస్రో దృష్టిసారించేందుకు ఇది దోహదపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సహజ వాయువు ధర నిర్ణయించే సూత్రాన్ని సవరించేందుకు, ధరకు పరిమితి విధించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సంపీడన సహజ వాయువు (సీఎన్‌జీ), గొట్టపు మార్గాల ద్వారా సరఫరా చేసే గ్యాస్ (పీఎన్‌జీ) ధరను 10 శాతం వరకు తగ్గించేందుకు ఈ నిర్ణయం వీలు కల్పిస్తుంది.