- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 19-1-2023
తొలిసారి తగ్గిన చైనా జనాభా:
జననాల రేటు తగ్గి, వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు చైనా ప్రకటించింది.
2021 కంటే 2022 చివరి నాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిందని ఆ దేశ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.
చైనా మొత్తం జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేశారు.
మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని, 2023 ఏప్రిల్ నాటికి అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందని గతేడాది నవంబర్ 15న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
1950 తర్వాత తొలిసారిగా 2020 లోనే ప్రపంచ జనాభా 1 శాతం తగ్గిందని తెలిపింది.
ఈ లెక్కన 2050 నాటికి భారత జనాభా 166.80 కోట్లకు చేరుకోనుందని అప్పటికి చైనా జనాభా 131.70 కోట్లే ఉంటుందని ఐరాస అంచనా వేసింది.
మక్కీ అంతర్జాతీయ ఉగ్రవాది: ఐరాస
లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస)నిర్ణయం తీసుకుంది.
భద్రతా మండలికి చెందిన ఐఎస్ఐఎల్, ఆల్‌ఖైదా ఆంక్షల కమిటీ మక్కీని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
భారత్, అమెరికా ఈ మేరకు ప్రతిపాదించగా.. చైనా అడ్డుపడింది.
తాజాగా డ్రాగన్ తన అభిప్రాయాన్ని మార్చుకోవడంతో ఈ నిర్ణయం వెలువడింది.
మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంతో అతడికి సంబంధించిన ఆస్తుల స్వాధీనం, ప్రయాణాలు, ఆయుధాల కొనుగోళ్లపై నిషేధం మొదలైనవి అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం ఐరాస నిషేధిత జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన లేదా పాకిస్థాన్ తో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదుల సంఖ్య 150 కి చేరుకుంది.
సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం:
సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు.
ఇప్పటివరకు 8 వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి.
సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో 8వ రైలు ప్రారంభమైంది.
8 వందే భారత్ రైళ్లు ప్రారంభం:
1.2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ- వారణాసి
2.2019 అక్టోబర్ 3న న్యూఢిల్లీ- కాట్రా
3.2022 సెప్టెంబర్ 30న గాంధీనగర్- ముంబై
4.2022 అక్టోబర్ 13న న్యూఢిల్లీ- అంబ్ అందౌర
5.2022 నవంబర్ 11న చెన్నై- మైసూరు
6.2022 డిసెంబర్ 11న బిలాస్‌పూర్- నాగ్‌పూర్
7.2022 డిసెంబర్ 30న హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్(NJP)
8.2022 డిసెంబర్ 15న సికింద్రాబాద్-విశాఖపట్నం.