- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 10-2-2023
భారత కాకస్ సహాధ్యక్షులుగా రో ఖన్నా, మైక్ వాల్ట్‌జ్:
అమెరికాలోని ప్రస్తుత 118వ కాంగ్రెస్ సభలో భారత్‌తో పాటు ఇండో అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన కాకస్ సహాధ్యక్షులుగా (కో -ఛైర్స్) ఇండో అమెరికన్ అయిన డెమోక్రటిక్ సభ్యుడు రో ఖన్నా (46), రిపబ్లిక్ హౌస్ సభ్యుడు మైక్ వాల్ట్ జ్ ఎన్నికయ్యారు. ఈ కాకస్ అమెరికా ప్రతినిధుల సభలో చట్టసభ సభ్యుల అతిపెద్ద ద్వైపాక్షిక కూటమి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి కృషి చేస్తుంది. 1993లో మొదటిసారిగా ఏర్పడిన ఈ కాకస్‌కు ఇప్పటిదాకా సహాధ్యక్షుడిగా అమీ బేరా పనిచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సభలో అయిదుగురు ఇండో అమెరికన్లు ఉన్నారు.
12 వేల అడుగుల ఎత్తులో .. పొడవైన ఐస్ ట్రాక్:
హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని నాకో సదస్సు వద్ద సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 12 వేల అడుగుల ఎత్తులో సహజ సిద్ధంగా ఉన్న ఈ సరస్సులో పొడవైన ఐస్ ట్రాక్ తీర్చిదిద్ది ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని సిద్ధం చేశారు. ఇక్కడ మైనస్ 18 డిగ్రీల వాతావరణంలో జాతీయ స్థాయి ఐస్ స్కేటింగ్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 15 రాష్ట్రాల నుంచి 70 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి.
2023-24 తెలంగాణ బడ్జెట్:
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 2,90,396 కోట్లతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో సంక్షేమం, వ్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా నిలిచాయి. ఈ భారీ బడ్జెట్ ను 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.
2018 ఎన్నికల హామీల అమలు లక్ష్యంగా రూ. 90 వేల లోపు రుణాలను మాఫీ చేసేందుకు వీలుగా నిధులు కేటాయించారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వాటాను ప్రభుత్వం పెంచింది.
బడ్జెట్ కేటాయింపులు:
నీటిపారుదల రంగం రూ. 26,885 కోట్లు
వ్యవసాయ రంగం రూ. 26,831 కోట్లు
విద్యుత్ రంగం రూ. 12,727 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
ఆసరా పించన్లకు రూ. 12,000 కోట్లు
దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,233 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 6,229 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ. 3,210 కోట్లు
మహిళా శిశు సంక్షేమానికి రూ. 2,131 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 2,200 కోట్లు
హరితహారానికి రూ. 1,471 కోట్లు
విద్యారంగానికి రూ. 19,093 కోట్లు
వైద్య, ఆరోగ్య రంగానికి రూ. 12,161 కోట్లు
పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,372 కోట్లు
రోడ్లు భవనాలకు రూ. 2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు
హోం శాఖకు రూ. 9,599 కోట్లు
కేసీఆర్ కిట్ కోసం రూ. 200 కోట్లు
కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 1000 కోట్లు
సర్వేశ్వర శర్మకు ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు:
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సైన్స్ రచయిత, కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వర శర్మకు కామన్వెల్త్ ఒకేషనల్ విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకమైన డి.ఎస్‌సి (డాక్టర్ ఇన్ సైన్స్) డిగ్రీని ప్రదానం చేసింది. ఢిల్లీలోని గురుగ్రామ్ లో నిర్వహించిన స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయ ప్రో - వైస్ ఛాన్సలర్ డాక్టర్ రిపురంజన్ సిన్హా చేతుల మీదుగా ఈ డిగ్రీని అందుకున్నట్లు తెలిపారు.
స్నాతకోత్సవంలో 16 పీహెచ్‌డీ డిగ్రీలు ఉండగా శర్మ ఒక్కరికే డి.ఎస్‌సీ డిగ్రీ దక్కడం విశేషం. ఇతర శాస్త్ర రంగాల పరిశోధనల్లో భౌతిక శాస్త్రం ఉపయోగపడుతున్న తీరుపై రాసిన సిద్ధాంత గ్రంథానికి ఈ డిగ్రీని ప్రదానం చేశారన్నారు. అక్కడే గ్లోబల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిర్వహించిన మరో కార్యక్రమంలో ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డును కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ సల్వాటోర్ మోకియా అందించినట్లు తెలిపారు.