- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంధకారంలో R అండ్ B అతిథి గృహం.. ఎందుకో తెలుసా.?
దిశ, చేవెళ్ల : విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో శంకర్‌పల్లి రోడ్లు భవనాల శాఖకు చెందిన అతిథి గృహానికి ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అతిథి గృహం అంధకారంలో మగ్గుతోంది. రోడ్లు భవనాల శాఖ ఆధీనంలోని ఈ అతిథి గృహం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అధికారిక పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు.
ప్రభుత్వ అధికారులు, ఆయా పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మండల పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ విశ్రమిస్తారు. కాగా, ఈ అతిథి గృహం పర్యవేక్షణ పూర్తిగా రోడ్లు భవనాల శాఖ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నది. ఈ అతిథి గృహానికి సంబంధించి ప్రతీ నెల సుమారుగా రూ. 5,000 చొప్పున విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రతీ నెలా చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో తడిసి మోపెడై రూ.2 లక్షల 75వేల122కు బకాయి పడింది. సుమారు మూడు సంవత్సరాలుగా హైదరాబాద్ ఆర్ అండ్ బీ అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ బిల్లులు చెల్లిస్తేనే కరెంట్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామని బిల్లు డబ్బులు మంజూరు కాగానే చెల్లిస్తామని అధికారి సందీప్ చెబుతున్నారు. మూడు సంవత్సరాలుగా కరెంట్ కనెక్షన్ తొలగించడంతో అతిథి గృహం అంధకారంలోనే ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రులు గాని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.