పాడైన కూరగాయలతో విద్యుత్‌​ ఉత్పత్తి

by Anukaran |
పాడైన కూరగాయలతో విద్యుత్‌​ ఉత్పత్తి
X

దిశ, కంటోన్మెంట్ : సంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించేందుకు మార్కెటింగ్‌ శాఖ చర్యలు చేపడుతోంది. నగర మార్కెట్లలో ప్రతీ రోజు పేరుకుపోయే వ్యర్థాల నుంచి విద్యుత్‌ ను తయారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పైలెట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోనే అతిపెద్ద కూరగాయాల మార్కెట్ బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో బయోఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు కు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ప్లాంట్ ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ఏడాదికి రూ.30లక్షల వరకు విద్యుత్​బిల్లులు ఆదాకానున్నాయి. మరో వైపు వ్యర్థాల సేకరణతో పారిశధ్యం మెరుగుపడడమే కాకుండా పర్యావరణానికి మేలు చేకూరనుంది.

వ్యర్థాలే ముడి సరుకు..

హైదరాబాద్‌ లో మార్కెట్లలో రోజుకు దాదాపు 15 టన్నుల వరకు వ్యర్థాలు మిగిలిపోతుంటాయి. బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, గడ్డిఅన్నారం మార్కెట్ల నుంచి 10 టన్నులు, ఎల్బీనగర్‌, గుడిమల్కా పూర్‌ మార్కెట్ల నుంచి 5 టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. వీటిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది వాహనాల ద్వారా జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఇలా తరలించే బదులుగా విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. రోజుకు 10 టన్నుల చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా తొలుత బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మార్కె ట్‌ లో ఏర్పాటు చేసిన బయో ఎనర్జీ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్లాంట్‌ నిర్మాణానికి రూ.2 కోట్లు కేంద్రం మంజూరుచేయగా, మిగితా సివిల్‌ వర్క్స్‌, ఇతర పనులకోసం మార్కెటింగ్ శాఖ మరో రూ.కోటి వెచ్చించింది.

రూ.30 లక్షలు ఆదా..

ఒక్క బోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మార్కె ట్‌లో రోజూ 800 యూనిట్లకు పైగా విద్యుత్‌ వినియోగం జరుగుతుంది. నెల నెలా రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి దాదాపు రూ.30 లక్షల వరకు విద్యుత్‌ బిల్లులు వచ్చేవి. ఈ మధ్యన గడ్డి అన్నారం, ఇతర మార్కెట్లు, బోయిన్ పల్లిలో సేకరిస్తున్న చెత్తతో ట్రయల్ రన్ లో భాగంగా విద్యుత్ ఉత్పత్తి చేయగా, విద్యుత్ బిల్లులు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.1.50లక్షలకు తగ్గినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో 10 టన్నుల సామర్థ్యం కలిగిన విద్యుత్​ఉత్పత్తి చేసినట్లయితే కరెంట్ బిల్లులు జీరో స్థాయికి చేరుతాయని వారంటున్నారు. పూర్తిస్థాయిలో ప్లాంట్‌ అందుబాటులోకి తేవడం ద్వారా ఏటా రూ.30 లక్షలకు పైగా విద్యుత్‌ బిల్లులు ఆదా కావడంతోపాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. బోయిన్​పల్లిలో ప్లాంట్‌ నిర్మాణం సక్సెస్‌ అయితే రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లకు విస్తరించాలని మార్కెటింగ్‌ శాఖ ఆలోచిస్తోంది. బోయిన్​పల్లి చేపట్టిన ప్రాజెక్టును ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్​ అభినందించారు.

రాష్ట్రంలోనే ప్రప్రథమం..

రాష్ట్రంలోనే తొలిసారిగా బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో చెత్తతో కరెంట్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేశాం. ఈ ప్లాంట్ ను త్వరలోనే మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నాం. దీంతో మార్కెట్ లో చెత్త సమస్య తగ్గుతోంది. పర్యావరణానికి మేలు జరుగుతోంది.

– టీఎన్ శ్రీనివాస్, బోయిన్ పల్లి మార్కెట్ చైర్మన్

విద్యుత్ బిల్లులు ఆదా..

బోయిన్ పల్లిలో మార్కెట్ యార్డులో నెలనెలా రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నాం. కొన్ని రోజులుగా ట్రయల్ రన్ లో భాగంగా చెత్తతో బయో ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నాం. దీంతో ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర నెల నెలా విద్యుత్ బిల్లులు ఆదా చేస్తున్నాం. పూర్తిస్థాయిలో ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏటా రూ.30 లక్షల విద్యుత్ బిల్లులు ఆదా అవ్వడంతో పాటు చుట్టుపక్కల వారికి మిగులు కరెంట్ ను విక్రయించే అవకాశం ఏర్పడుతోంది.

– శ్రీనివాస్, బోయిన్ పల్లి మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి

Advertisement

Next Story