- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫామ్ఆయిల్ పంటను సాగు చేయండి: ఎమ్మెల్యే గండ్ర
దిశ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఫామ్ ఆయిల్ పంటలనుసాగుచేసి అధిక లాభాలను పొందాలని భూపాల పల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఆదివారం రోజు భూపాల పల్లి మండలం లోని కాసిం పల్లి గ్రామంలో పామ్ ఆయిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంవత్సరం భూపాలపల్లి జిల్లా లో దాదాపు 45వేల ఎకరాలలో ఈ పంటను వేయనున్నామని, సంవత్సరానికి ఎకరాకు 1 లక్ష రూపాయల నికర లాభం వస్తుందని ఆయన తెలిపారు. అంతేగాక ఈ పంటలో అంతర్గత పంటలు వేసి అధిక లాభాలు పొందవచ్చునని ఆయన అన్నారు.
మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలోనే నూతన పంటను పరిచయం చేస్తూ పామ్ ఆయిల్ పెట్టి రైతులకు అత్యంత ఆదాయం వనరులను కల్పించాలని ఉద్దేశ్యం తో పామాయిల్ పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇస్తూ, రైతులను ప్రోత్సహిస్తూ పెట్టిన పంట ఇది అని ఆయన అన్నారు. పెరుగుతున్నటువంటి నూనె యొక్క అవసరాలకు అనుగుణంగా నూనెకు సంబంధించినటువంటి ధాన్యాన్ని పల్లీలు, పొద్దు తిరుగుడు కావచ్చు మరి అనేక పంటలు ఈరోజు మన యొక్క అవసరాలు తీరుస్తున్నాయని,భారతదేశం 130 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం మన అవసరాలకు సరిపోయేటట్టి నూనె ఉత్పత్తి లేని సందర్భంలో విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు.
ఈ సందర్భంలో విదేశీ మారక ద్రవ్యం అనేక దేశాలకు పోతున్నదని దానిని మనం ఆదా చేసుకునే అవసరం ఎంతైనా ఉందన్నారు.మన దేశంలో అత్యధికంగా వరి ధాన్యం ను పండిస్తున్నామని దానికి బదులుగా ఇతర పంటలు వేసిన రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వం పామాయిల్ పంటను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో మొదటి మూడు సంవత్సరాల పాటు రైతులు ఫామ్ ఆయిల్ పంట వేస్తారో వారికి ఆదాయ తక్కువ అవుతుందని,రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదాయ వనరుల కింద పెట్టుబడి సహాయం, మరి మొక్కల పై సబ్సిడీ,డ్రిప్ వంటి పథకాలను అందిస్తుందన్నారు. ఉత్సాహవంతులైన రైతు సోదరులు ఈ సదవకాశం ఉపయోగించు కోవాలని కోరారు. పంటను మొదటి మూడు సంవత్సరాలపాటు కాపాడుకుంటే దాదాపు జీవిత కాలం వరకు అంటే దాదాపు 45 సంవత్సరాల పాటు నిరంతరం ఆదాయం వస్తుందన్నారు.
అనంతరము అంతర పంటలు పెట్టుకోవచ్చని. దీని ద్వారా అధిక ఆదాయం వస్తుందనీ,దీని రైతు సోదరులు రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఉపయోగించు కోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ సగ్గెం వెంకట రాణి సిద్ధూ,వైస్ చైర్మన్ హరిబాబు, పి ఎ సి సి ఎస్ చైర్మన్ మేకల సంపత్,టౌన్ పార్టీ అధ్యక్షుడు జనార్ధన్, కౌన్సిలర్లు,జిల్లాముఖ్యనాయకులు,కార్యకర్తలు,రైతులు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.