- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CSK కెప్టెన్ సెహ్వాగ్ అనుకున్నాం..
దిశ, స్పోర్ట్స్ : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలపడమే కాకుండా, ప్రతీ సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్ (Play Offs)కు చేర్చిన ఘనత ఎంఎస్ ధోనిదే. ఈ మెగా లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనికి పేరుంది. అయితే చెన్నై జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ మొదటి కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను అనుకున్నారట. 2008లో అతడిని కెప్టెన్‌గా నియమించడానికి చాలా ప్రయత్నించారట. కాగా, తాను మొదటి నుంచి ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాను కాబట్టి ఐపీఎల్‌లో కూడా ఢిల్లీ జట్టుకే ఆడతానని సెహ్వాగ్ తేల్చి చెప్పాడు.
దీంతో అప్పుడే ఇండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన ధోనిని తీసుకోవాలని నిర్ణయించారు. మొదట జరిగిన వేలంలో ధోని కోసం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో చెన్నై తీవ్రంగా పోటీ పడింది. ఆ ఏడాది ఏకంగా రూ.6 కోట్ల రూపాయలకు ధోనిని వేలంలో కొనుక్కున్నారు. తొలి సీజన్‌లో అత్యంత ధర పలికిన ఆటగాడు ధోనినే.
ఈ విషయాలను సీఎస్కే జట్టు క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రినాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడించాడు. ఇక ధోని నాయకత్వంలో టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిందనే చెన్నై అతడిపై భారీ మొత్తాన్ని వెచ్చించింది. 2008 నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కెప్టెన్సీని మార్చకపోవడం గమనార్హం. ఇక ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్‌కే మూడు సార్లు (2010, 2011, 2018) ఐపీఎల్ టైటిళ్లు గెలవగా.. రెండు సార్లు (2010, 2014) ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 (Champions League Twenty20) విజేతగా నిలిచింది.