చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడికి కరోనా

by Shiva |
చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న క్రమంలో కరోనా వ్యాప్తి పెరగడం, జట్టు సభ్యులు, సిబ్బంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ అక్షర్‌పటేల్ కరోనా బారిన పడగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌లోని ఒక కంటెంట్ టీమ్ సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడిని ఐసోలేషన్‌లో ఉంచారు.

‘అతడు జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది దగ్గరకు వెళ్లలేదు. ఇటీవలే క్యాంప్‌లో జాయిన్ అయ్యాడు. టీమ్ అందరూ సురక్షితంగా ఉన్నారు. రెగ్యూలర్ ప్రాక్టీస్ చేస్తున్నారు’ అని CSK యాజమాన్యం తెలిపింది. నెగిటివ్‌గా తేలిన తర్వాత కంటెంట్ సభ్యుడు తిరిగి జాయిన్ అవ్వుతాడని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed