అర్బన్ పార్కులు ఆక్సిజన్ ఫ్యాక్టరీలు

by Shyam |
అర్బన్ పార్కులు ఆక్సిజన్ ఫ్యాక్టరీలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: పట్టణ ప్రాంతాల్లో పచ్చదనంతో అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఆహ్లాదాన్నిమాత్రమే కాక ఆరోగ్యాన్ని కూడా అందించే ఆక్సిజన్ ఫ్యాక్టరీలు అని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును పరిశీలించిన ఆయన మూడు గంటల పాటు అక్కడే గడిపారు. అటవీ పునరుజ్జీవనం, తేమ పరిరక్షణ, రూట్ స్టాక్ అభివృద్ధి, అరుదైన మొక్కల పెంపకం, పర్యావరణానికి కలిగే ప్రయోజనం, సందర్శకులకు సౌకర్యం తదితరాలపై అటవీ అధికారులతో చర్చించారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న అటవీ భూముల్లోనూ, ఔటర్ రింగు రోడ్డుకు ఐదు కిలో మీటర్ల పరిధిలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 32 పార్కులు పూర్తయ్యాయని, రాష్ట్ర వ్యాప్తంగా 95 అటవీ పార్క్ లకు ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 16న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో హరితహారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యాన వనాల అభివృద్ధిపై చర్చ ఉంటుందన్నారు.

యాదాద్రి మోడల్ (మియావాకి ప్లాంటేషన్)లో ప్రతీ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో చిక్కగా మొక్కలు నాటి చిట్టడవులను అభివృద్ధి చేస్తామన్నారు. హరిత తెలంగాణ లక్ష్యంలో అందరినీ భాగస్వాములను చేస్తామని, అందరి జీవన విధానం మెరుగుపడుతుందని అన్నారు. అటవీ ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ నిర్మించి, సహజ అటవీ పురుద్దరణకు ప్రాధాన్యతను ఇస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed