- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ బయోటెక్ సీఎండీతో సీఎస్ కీలక సమావేశం
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, భారత్ బయోటెక్ సీఎండీ క్రిష్ణా ఎల్లాతో మంగళవారం బీఆర్కే భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేపట్టటానికి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక డోసులను సరఫరా చేయాలని, రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీంతో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణాఎల్లా సానుకూలంగా స్పందించినట్టు సీఎస్ తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ డైరెక్టర్ డా.సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story