ఘోర రోడ్డు ప్రమాదం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి

by Sumithra |   ( Updated:2021-08-18 03:35:35.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని టేకులపల్లి మండలం రోళ్లపాడు క్రాస్ రోడ్డు వద్ద వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మద్రాసు తండాకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. చెన్నైలో సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్న మాళోతు జగదీష్ బాబు మూడు రోజుల క్రితమే సెలవు‌పై ఇంటికి వచ్చాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement

Next Story