- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుపాకీతో కాల్చుకుని… జవాన్ ఆత్మహత్య
by Sridhar Babu |
X
దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని తిప్పాపురం బేస్ క్యాంపులో సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్‌కు చెందిన జవాన్ రూపేశ్ నంద్(25) తీవ్ర మానసిక ఒత్తిడితో తుపాకీతో కాల్చుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈ జవాన్ కుటుంబానికి దూరంగా ఉండటం, ఇటీవల తన తండ్రి చనిపోవడం, సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోవడం వంటి కారణాలతో మానసిక తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు చర్ల సీఐ అశోక్ తెలిపారు. జవాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం తరలించారు. ఈ ఘటనతో తోటి జవాన్లలో విషాదం అలుముకొంది.
Advertisement
Next Story