రైతన్న కోసం ‘క్రాప్‌ దర్పణ్‌’ యాప్

by Anukaran |
రైతన్న కోసం ‘క్రాప్‌ దర్పణ్‌’ యాప్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయంలో ఆన్లైన్ సలహాలు పెంచేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఐఐటీ హైదరాబాద్, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బాంబే ఐఐటీ సహకారంతో స్పెషల్ యాప్ రూపొందించారు. క్రాప్ దర్పణ్ పేరుతో భారత్‌-జపాన్‌ జాయింట్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ ప్రాజెక్టు కింద ఈ యాప్​ను తీర్చిదిద్దారు. అయితే ముందుగా పత్తి పంటపై మాత్రమే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ యాప్​లో ఏర్పాట్లు చేశారు. తదుపరి దశల్లో ఇతర పంటలపై కూడా దృష్టి పెట్టి యాప్‌ల రూపకల్పన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ పి.కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అరవింద, రేవంత్‌, సాయిదీప్‌, శ్రీనివాస్‌ ఈ యాప్‌ రూపకల్పనకు కృషి చేశారు. పత్తి పంట పెరుగుదలను ప్రభావితం చేసే సమస్యలు, తెగుళ్లు, బ్యాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులు, పోషక లోపాలకు సంబంధించిన అంశాలు ఈ యాప్‌లో పాందుపర్పారు. చీడపీడలపై రైతులకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా అవగాహన కల్పించనున్నారు. https://www.cropdarpan.in/cropdarpan/ పోర్టల్‌లో లింకు ద్వారా ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వారు సూచించారు.

ప్రస్తుతం పత్తి పంటపై మాత్రమే తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో సిద్ధం చేయగా.. త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యాప్‌లోని ప్రశ్నలను ఎంపిక చేసుకుంటే వాటికి సమాధానాలు, తీసుకోవాల్సిన చర్యలతో పాటు విత్తనాలు ఎప్పుడు వేయాలి, పోషకాలు ఎలా అందించాలో ఈ యాప్‌ ద్వారా రైతులు తెలుసుకునే విధంగా రూపకల్పన చేశారు. త్వరలోనే దీన్ని గ్రామస్థాయి నుంచి ప్రచారం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed