మూసీ నదిలో మొసళ్లు.. వణికిపోయిన నగరవాసులు (వీడియో)

by Anukaran |   ( Updated:2023-10-10 16:58:53.0  )
మూసీ నదిలో మొసళ్లు.. వణికిపోయిన నగరవాసులు (వీడియో)
X

దిశ, సిటీ బ్యూరో: రెండురోజులుగా నగరంలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. అత్తాపూర్ సమీపంలోని మూసీలో శనివారం మధ్యాహ్నాం రెండు మొసళ్లు కనిపించాయి. నీటిలో మొసళ్లు కొట్టుకొచ్చినట్టు తెలియడంతో వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడారు. నీటిపై మొసళ్లు కదిలాడే చిత్రాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. కానీ శనివారం ఉదయం తాము ఒక మొసలిని చూశామని, మధ్యాహ్నాం కన్పించిన మొసలితో అది భిన్నంగా ఉందని స్థానికులు తెలిపారు. నీటిలో మొసళ్లు కొట్టుకొచ్చినట్టు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఇటీవల తరుచూ వర్షాలు కురవడంతో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరిగి, నీటి మట్టాలు పూర్తి స్థాయికి చేరడంతో గేట్లు తెరిచినపుడు ఈ మొసళ్లు నీటిలో కొట్టుకుని వచ్చి ఉండవచ్చునని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తామెప్పుడూ మూసీలో మొసళ్లను చూడలేదని, ఇప్పుడు ఏకంగా రెండు కన్పించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed