వర్షాల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మొసలి కలకలం.. ఆందోళనలో ప్రజలు

by Anukaran |
వర్షాల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మొసలి కలకలం.. ఆందోళనలో ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు వరదల కారణంగా అధికారులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అత్తాపూర్ వద్ద మూసీలో ఓ ముసలి సంచారం కలకలం రేపింది. దీంతో మొసలిని గమనించిన స్థానికులు వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు.

ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న అధికారులు.. వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో కిస్మత్‌పూర్ శివారులోనూ 2 మొసళ్ల కళేబరాలను అధికారులు గుర్తించారు.

Advertisement

Next Story