- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డొ.. మరో చరిత్ర
దిశ, స్పోర్ట్స్ : క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్ అభిమానులకు పరిచయం అక్కర లేని పేరు. పోర్చుగల్ జాతీయ జట్టులో కీలక సభ్యుడిగానే కాకుండా స్పానిష్, యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్స్ తరపున అతడి ఆట అనన్యసామాన్యం. ప్రస్తుతం యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో బుధవారం రాత్రి అరుదైన మైలురాయిని అధిగమించాడు. చాంపియన్స్ లీగ్ 2020-21లో భాగంగా డైనమో కేయేతో జరిగిన మ్యాచ్‌లో జువెంటస్ 3-0 స్కోరుతో గెలిచింది. దీంట్లో ఒక గోల్ క్రిస్టియానో రొనాల్డో చేశాడు. ఈ గోల్ ద్వారా అతడి కెరీర్ గోల్స్ సంఖ్య 750కి చేరుకున్నది. గత ఏడాది అక్టోబర్ నాటికి 700 గోల్స్‌తో ఉన్న రొనాల్డో.. ఏడాది తిరిగే లోపు మరో 50 గోల్స్ అతడి ఖాతాలో వేసుకున్నాడంటే అతడు ఎంత వేగంగా గోల్స్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఎక్కడ ఎన్ని గోల్స్?
ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచంలో దిగ్గజ ఆటగాళ్లంటే రొనాల్డో, మెస్సీనే. వీరిద్దరిలో రొనాల్డో చేసిన గోల్సే చాలా ఎక్కువ. తన కెరీర్‌లో 132 చాంపియన్స్ లీగ్ గోల్స్ చేసిన రోనాల్డో.. జువెంటస్ తరపున 12 గోల్స్ చేశాడు. ఇక అతడి మొత్తం క్లబ్ కెరీర్ గోల్స్ 648. తన క్లబ్ కెరీర్‌ను స్పోర్టింగ్ లిస్బన్ తరపున ప్రారంభించారు. ఆ జట్టు తరపున తొలి సీజన్‌లోనే ఐదు గోల్స్ చేశాడు. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్‌కు మారిన రొనాల్డో ఆ జట్టు తరపున 292 మ్యాచ్‌లు ఆడి 119 గోల్స్ చేశాడు. ఇక అతడి కెరీర్‌లో అత్యధిక క్లబ్ గోల్స్ చేసింది రియల్ మాడ్రిడ్ తరపునే. ఆ క్లబ్ తరపున సుదీర్ఘ కాలం ఆడిన రోనాల్డో మొత్తం 450 గోల్స్ చేశాడు. ఇక 2018లో రియల్ మాడ్రిడ్ నుంచి జువెంటస్‌కు మారాడు. అప్పటి నుంచి 75 గోల్స్ చేశాడు. తన కెరీర్‌లో క్లబ్ గోల్స్ మొత్తం 648 ఉన్నాయి.
అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో…
పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యడైన క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో 102 అంతర్జాతీయ గోల్స్ చేశాడు. ఫుట్‌బాల్ చరిత్రలో 100 గోల్స్ మైలురాయిని దాటిన రెండో ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. అతడి కంటే ముందు ఇరాన్‌కు చెందిన దిగ్గర ఫుట్‌బాలర్ అలీ దాయి ఉన్నాడు. అతడు కెరీర్‌లో 109 అంతర్జాతీయ గోల్స్ చేశాడు. రొనాల్డో అంతర్జాతీయ కెరీర్ ఇంకా ఉండటంతో అలీ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఇలా క్లబ్, అంతర్జాతీయ గోల్స్ అన్నీ కలిపి ఇప్పటికి రోనాల్డో 750 గోల్స్ చేశాడు. ఈ మైలు రాయిన అధిగమించిన తర్వాత రొనాల్డో తన ట్విట్టర్ ఖాతాలో మెసేజ్ చేశాడు. 750 గోల్స్.. 750 మధుర క్షణాలు.. 750 నవ్వులు అంటూ ఉద్వేగంగా పోస్ట్ చేశాడు.