వచ్చే నెలలో పెళ్లి… అంతలోనే విషాదం

by Kalyani |   ( Updated:12 July 2024 3:22 PM  )
వచ్చే నెలలో పెళ్లి… అంతలోనే విషాదం
X

దిశ: రాజోలి: కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి కిడ్నీ వ్యాధితో మృతి చెందిన సంఘటన రాజోలి మండలంలోని మాందొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మాందొడ్డి గ్రామానికి చెందిన రూబిక (22) కిడ్నీ వ్యాధి, తీవ్రమైన జ్వరంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. రూబిక గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధికి గురై వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతోంది. కిడ్నీ వ్యాధి, జ్వరం తీవ్రత పెరగడంతో ఆమెను కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం తో, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లి కూతురిగా చూడాల్సిన తమ కూతురిని విగతజీవిగా చూడాల్సి వచ్చిందని తల్లిదండ్రులు రోధించడం అందరిని కలిచివేసింది. కాగా రూబిక మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story