జగిత్యాల జిల్లాలో ముగ్గురు దొంగలు అరెస్ట్..

by Aamani |
జగిత్యాల జిల్లాలో ముగ్గురు దొంగలు అరెస్ట్..
X

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా పట్టణ, పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జిల్లా ఎస్పీ ఆఫీస్ లో ఎస్పీ అశోక్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. శనివారం కొండగట్టు జేఎన్టీయూ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన చెకింగ్ చేస్తుండగా ముగ్గురు నిందితులు పట్టుబడగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. జగిత్యాల పట్టణం టీఆర్ నగర్ కు చెందిన వనం రాము, జగన్నాథ్ అభియా, జగన్నాథ్ మీనయ్య తో పాటు బంగారాన్ని కొన్న సిద్ధార్థ్ జ్యువెలర్స్ యజమాని గంగాధర్ ని అరెస్టు చేశామని తెలిపారు.

నిందితులు ఉదయం వాహనాల మీద వెళ్తూ అన్ని వార్డులను తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను గమనించి రాత్రి సమయంలో ఊరి చివరలో వాహనాన్ని నిలిపి దొంగతనం చేసి తిరిగి వారి వాహనాలపై పారిపోవడం జరుగుతుందని తెలిపారు. నిందితుల నుంచి 260 గ్రాముల బంగారం, హ్యుందాయ్ ఐ20 కార్, మూడు వ్యవసాయ మోటర్లు, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి అంచనా విలువ సుమారు 30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వీరిపై ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లో 11 కేసులు నమోదయ్యాయని అన్నారు. అలాగే ప్రజలు ముందస్తు గా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీ రఘు చందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్ఐ సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed