భారీగా గంజాయి పట్టివేత..ముగ్గురు అరెస్ట్

by Jakkula Mamatha |   ( Updated:2024-03-20 14:46:30.0  )
భారీగా గంజాయి పట్టివేత..ముగ్గురు అరెస్ట్
X

దిశ ప్రతినిధి,అనకాపల్లి: యువకులు గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు.కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు సమాచారం మేరకు డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయి నిల్వలపై పోలీసులు దాడి చేశారన్నారు.ఈ ఘటనలో 17 గంజాయి బస్తాలను గుర్తించారని, వాటిలో 532 కేజీలు ఉందన్నారు. వీటి విలువ రూ. 26 లక్షల 60 వేల రూపాయలు ఉంటుందన్నారు. ఒరిస్సా ప్రాంతం నుంచి కాలినడకన గుర్రాల పై తీసుకువచ్చి బచ్చింత గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచి, కావలసిన వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారన్నారు.

పోలీసులకు పక్కా సమాచారం అందడంతో గంజాయి తో పాటు ముగ్గురు వ్యక్తులు పాంగి సుందర్రావు, వంతల చిన్న, పాంగి మాణిక్యం లను అదుపులో తీసుకోగా మరో వ్యక్తి పరార్ లో ఉన్నారన్నారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గారని చెప్పారు. కానీ ఒరిస్సా వంటి ప్రాంతాల నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్నారు. యువకులకు డబ్బులు ఆశ చూపించి, కొంతమంది పైలెట్లుగా గంజాయి తరలించే బాధ్యతను తీసుకుంటున్నారని తెలిపారు.అలాంటి యువకులు పట్టుబడినట్లైతే జైల్లో మగ్గే అవకాశం ఉంటుందన్నారు. రూ.10 వేల గురించి ఆశ పడితే, బంగారు జీవితం నాశనం అవుతుందన్నారు.కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, కొయ్యూరు ఎస్సై రామకృష్ణ మంప ఎస్సై లోకేష్ కుమార్ ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Read More..

చెన్నైలో ఏపీ వాసుల నుంచి భారీగా నగదు, బంగారం పట్టివేత

Advertisement

Next Story

Most Viewed