SI శ్రీరాముల శ్రీనివాస్ మృతి.. నలుగురు కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు విధించిన ఉన్నాతాధికారులు

by Anjali |   ( Updated:2024-07-12 06:30:28.0  )
SI శ్రీరాముల శ్రీనివాస్ మృతి..  నలుగురు కానిస్టేబుల్స్‌పై సస్పెన్షన్ వేటు విధించిన ఉన్నాతాధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఐ వేధింపులతో అశ్వరావుపేటలో వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఆదివారం శ్రీనివాస్ మృతి చెందారు. చనిపోయే ముందు శ్రీనివాస్.. నలుగురు కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు సహా సీఐ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నట్లు మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. కాగా ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిపై చర్యలు తీసుకుని సస్పెన్షన్ వేటు విధించారు. ‘ఓ దళిత కుసుమం నేల రాలింది. కారణం ఏదైనా... కారకులు ఎవరైనా కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను వదిలి, ఇద్దరు పసిబిడ్డలను తండ్రిలేని వాళ్ళను చేసి, సమాజానికి ధైర్యం ఇచ్చే ఓ పోలీస్ అధికారి పరిస్థితులను ఎదిరించే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్నారు. అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది. మంచి భవిష్యతు పోగొట్టుకున్నారు. ఎంత బాధ కలిగివుంటే ఆత్మహత్య చేసుకొని ఉంటాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వం మాత్రమే. పోలీస్ సంక్షేమం, వారికి సెలవులు, పని వొత్తిడి తగ్గింపు చాలా అవసరం’. అంటూ నెట్టింట జనాలు పోలీసు వ్యవస్థ తీరుపై తప్పుపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed