బైక్ కొనివ్వలేదని భార్యను నరికి చంపిన భర్త

by Mahesh |   ( Updated:2023-12-30 06:39:32.0  )
బైక్ కొనివ్వలేదని భార్యను నరికి చంపిన భర్త
X

దిశ, మామడ: అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త భార్య పాలిట యముడయ్యాడు. భర్తకు భార్య బైక్ కొనివ్వలేదని అక్కసుతో ఆమెను గొడ్డలితో నరికి చంపిన ఘటన గ్రామంలో కలకలం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి మామడ మండలంలోని గ్రామానికి చెందిన సుర లక్ష్మి (49) ని భర్త సూర నర్సయ్య గొడ్డలితో నరికి చంపాడు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ కలహాలు, తనకు బైక్ కొనివ్వలేదని నరసయ్య తన మనసులో పెట్టుకొని ఎవరూ లేని సమయంలో పదునైన గొడ్డలితో మెడపై నరికాడు. మెడ రెండు భాగాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కూతురు పెనుకొండ వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.

Advertisement

Next Story