- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
140 సార్లు.. 39 ఏళ్ల మహిళతో 22 ఏళ్ల యువకుడు శృంగారం.. 30 ఏళ్లకు బయటపడ్డ అసలు నిజం
దిశ, వెబ్‌డెస్క్ : విలాసవంతమైన జీవితం గడపాలన్నది ఆమె కోరిక.. ఖరీదైన కాల్ గర్ల్‌తో శృంగారం చేయాలన్నది అతడి కోరిక. ఇద్దరి కోరికలు తీరినా ఓ క్రూరమైన హత్య జరిగింది. 140 సార్లు కత్తిపోట్లు పొడిచి అతి దారుణంగా చంపేసి ఎలాంటి ఆధారాలు వదలకుండా 30 ఏళ్లు తప్పించుకుని తిరిగాడు ఓ హంతకుడు. పోలీసులు మూడు దశాబ్దాలలో మూడు సార్లు ఆ కేసును రీ ఓపెన్ చేసి ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. 30 ఏళ్ల తర్వాత అతడే హంతకుడు అని రుజువు చేయడానికి పోలీసులకు కేవలం అతి చిన్న వెంట్రుక సాయపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత నెల నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసినా.. అతడు పై కోర్టుకు అప్పీల్ చేసుకోవడంతో ఈ కేసు మళ్లీ వార్తల్లోకెక్కింది. లండన్‌లో జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఫోన్ కాల్‌తో వెలుగులోకి..
1994 ఆగస్టు 8వ తేదీ రాత్రి. ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి తన భార్య హత్యకు గురైందని సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, గదిలో రక్తంతో తడిసిన 39 ఏళ్ల మహిళ మృతదేహం కనిపించింది. నేల నుంచి బెడ్‌షీట్ వరకు ఎక్కడ చూసినా రక్తపు గుర్తులు కనిపించాయి. పోలీసులు గదిలో ఎంత వెతికినా ఏమీ దొరకలేదు. హత్యకు ఉపయోగించిన ఆయుధం గానీ హంతకుడికి సంబంధించిన ఎలాంటి క్లూ లభించలేదు. కానీ పోలీసులకు వంటగదిలో ఒక బ్యాగ్.. దానిపై అనేక మంది వ్యక్తుల వేలిముద్రలను గుర్తించారు. అయినా ఈ కేసులో హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులకు 30 ఏళ్లు పట్టింది.
ప్రేమ వివాహం.. మనస్పర్థాలు..
మెరీనా కొప్పెల్ (39). వృత్తిరీత్యా కాల్ గర్ల్. 1983లో ఆమె ఒక హోటల్‌లో క్లీనింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నప్పుడు ఓ డేవిడ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత, మెరీనా హోటల్ ఉద్యోగం వదిలి, మొదట మసాజ్ పార్లర్‌లో పని చేసి, ఆ తరువాత కాల్ గర్ల్‌గా మారింది. భర్త డేవిడ్‌కు ఆమె పని నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థాలు వచ్చి విడివిడిగా ఉంటున్నారు. అయినా భర్తపై ప్రేమతో మెరీనా ప్రతివారం అతడి ఇంటికి వెళ్లేది. మెరీనాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిని ఆమె కొలంబియాలోని తన తల్లిదండ్రులకు పంపించి వారి ఖర్చుల కోసం ప్రతినెలా డబ్బులు పంపేది.
కస్టమర్ల కోసం స్పెషల్ గది
మెరీనా డబుల్ బెడ్ రూం ఫ్లాట్‌లో ఒంటరిగా ఉండేది. అందులో ఓ గదికి కేవలం తనతో సుఖం పంచుకునేందుకు వచ్చే కస్టమర్లకు కేటాయించింది. మెరినా లండన్‌లో ఖరీదైన కాల్ గర్ల్‌గా పేరొందటంతో ఆమె దగ్గరకు వ్యాపారవేత్తలు, వైద్యులు, రాజకీయ నాయకులు ఎక్కువగా వచ్చేవాళ్లు. అయితే మెరీనా ఆదివారం, ఆగస్టు 7, అంటే ఆమె మరణానికి ఒక రోజు ముందు తన భర్తను కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ఇరువురి మధ్య మరోసారి వాగ్వాదం జరగడంతో మెరీనా తిరిగొచ్చి ఆ రాత్రి ఓ హోటల్‌లో క్లయింట్‌తో గడిపి తన ఫ్లాట్‌కు వచ్చి పడుకుంది. మరుసటి రోజు ఉదయం భార్యభర్తలు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుని రాజీ పడ్డారు.
ఆ గది నిండా వేలిముద్రలే..
ఆగస్ట్ 8న మధ్యాహ్నం డేవిడ్ మెరీనాకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం వరకు డేవిడ్ ఆమెకు చాలాసార్లు ఫోన్ చేసినా మెరీనా నుండి స్పందన లభించలేదు. ఆందోళన చెందిన భర్త రాత్రి 9 గంటల సమయంలో నేరుగా మెరీనా ఫ్లాట్‌కు చేరుకున్నాడు. అక్కడ క్లయింట్ గదిలో తన భార్య మెరీనా మృతదేహం పడి ఉంది. షాక్ తిన్న డేవిడ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తసిక్తమైన గదినంతా పరిశీలించినా హంతకుడికి సంబంధించిన ఎలాంటి క్లూ గుర్తించలేకపోయారు. ఆమెతో శృంగారం కోసం ఎంతో మంది కస్టమర్లు ఆ గదిలోకి వచ్చే వాళ్లు. దీంతో ఆ గదిలో చాలా మంది గుర్తు తెలియని వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. అంతే కాకుండా వంటగదిలో దొరికిన బ్యాగ్‌పై పలువురి వేలిముద్రలు కూడా ఉన్నాయి. పోస్ట్ మార్డంతో మెరీనా దేహంపై 140 కత్తిపోట్లను గుర్తించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల మధ్య ఆమెను హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
పోలీసులకు సవాల్‌గా మారిన మెరీనా కేసు
కొన్నేళ్లపాటు దర్యాప్తు సాగిన ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును తాత్కాలికంగా మూసేశారు. కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ 2008 సంవత్సరంలో ఈ కేసును రీఓపెన్ చేశారు. అన్ని సాక్ష్యాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఈసారి హత్య సమయంలో మెరీనా ధరించిన ఉంగరంలో ఒక చిన్న వెంట్రుక ఇరుక్కుని ఉండటాన్ని ఫోరెన్సిక్ నిపుణుడు గమనించాడు. అయితే, అప్పట్లో డీఎన్‌ఏ టెక్నాలజీ అంతగా లేకపోవడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఆ ఆధారాలు చెక్కు చెదరకుండా పోలీసులు భధ్రపరిచారు. మళ్లీ మెరీనా కేసు మూతపడింది.
ప్రియురాలి ఫిర్యాదుతో పాత కేసు వెలుగులోకి..
మెరీనా కేసును అందరూ మరిచిపోతున్న సమయంలో సెప్టెంబర్ 14, 2013న పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. తన ప్రియుడు తనను దారుణంగా కొట్టి హింసిస్తున్నాడని ఓ మహిళ కంప్లైట్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. బాధిత మహిళ రక్తసిక్తమై తీవ్రంగా గాయాలపాలు కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి ఆము ప్రియుడు సందీప్ పటేల్ అరెస్ట్ చేశారు. అయితే తాజా ఘటనకు, మెరీనా కేసుకు కొన్ని పోలికలు కలవడంతో ఆ కేసును మళ్లీ రీ ఓపెన్ చేశారు పోలీసులు. మెరీనా గదిలో లభించిన వేలిముద్రలు, పాద ముద్రలు పరిపోవడతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే సందీప్ పటేల్‌కు DNA పరీక్షలు నిర్వహించగా.. మెరీనా రింగ్‌లో చిక్కుకున్న చిన్న వెంట్రుక DNAతో మ్యాచ్ అయింది. ఆ వివరాలతో మెరీనా కేసును కోర్టు ముందుకు తెచ్చారు పోలీసులు.
మెరీనా హత్యకు కారణం ఇదే..
మెరీనాను హత్య చేసే నాటికి సందీప్ పటేల్ వయసు 22 ఏళ్లు. ఆ సమయంలో సందీప్ తండ్రి ఒక వార్తా సంస్థను నడుపుతున్నాడు. దాంట్లోనే పని చేస్తున్న పటేల్.. మెరీనాలాంటి హై ప్రొఫైల్ కాల్ గర్ల్ వద్ద ఒక్కరోజైనా గడపాలని ఉండేది. ఆ సమయం (1994)లో మెరీనా ఒక్కొక్కరి వద్ద 80 పౌండ్లు (నేటి ప్రకారం దాదాపు 8400 రూపాయలు) వసూలు చేసేది. సందీప్ సైతం ఆమె అడిగిన మొత్తాన్ని చెల్లించి గదిలోకి వెళ్లాడు. కానీ, అక్కడికి చేరుకున్న తర్వాత సందీప్ శృంగారం తప్ప మిగతా అసహజమైన పనులు చేస్తూ క్రూరత్వానికి పాల్పడుతూ హద్దులు దాటేశాడు. దీంతో విసుగు చెందిన మెరీనా చేసే శృంగారం చెయ్యి లేకపోతే వెళ్లిపో అని గట్టిగా చెప్పింది. అవమానభారంతో కృంగిపోయిన పోయిన సందీప్ పటేల్ ఆమెపై కత్తితో దాడి చేసి 140 సార్లు పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు సందీప్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 16న 19 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
శిక్ష ఖరారు చేసిన న్యాయమూర్తి తన తీర్పులో.. ‘‘మెరీనా ముందు లైంగికంగా చేయలేకపోయినందుకు సందీప్ ఆమెను హత్య చేశాడని మాకు పూర్తి అనుమానం ఉంది. సెక్స్ వర్కర్ వద్దకు వెళ్లిన తర్వాత, మీరు ఆమె ముందు లైంగికంగా చేయలేకపోయినప్పుడు మీరు అవమానంగా భావించారు. మీరు నియంత్రణ కోల్పోయి మెరీనాను చంపేంత స్థాయిలో అవమానంతో నిండిపోయారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న సందీప్ ఈ కేసును పై కోర్టులో ఫైల్ చేశారు.