రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో NIA దాడుల కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-21 04:06:02.0  )
రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో NIA దాడుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసముంటున్నట్లు తెలిసింది. గత కొంత కాలంగా కుమారులు కనిపించడం లేదని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో నాగులబావిలోని తండ్రి అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story