కానిస్టేబుల్‌పై దురుసు ప్రవర్తన.. 9 మంది అరెస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-15 06:16:56.0  )
కానిస్టేబుల్‌పై దురుసు ప్రవర్తన.. 9 మంది అరెస్ట్
X

దిశ: అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో 9 మంది వ్యక్తుల‌ను అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఎస్.ఐ ఎస్డి షాహినా తెలిపారు. గత నెల 25వ తేదీన రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో అన్నపురెడ్డిపల్లి గ్రామ శివారులో గల శివాలయం వద్ద కొంతమంది వ్యక్తులు మద్యం తాగారు. రెండు గ్రూపులుగా గొడవ పడుతున్నారని డయల్ 100 ద్వారా సమాచారం రాగా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ టి. గోపాలకృష్ణ, ఎల్. సర్వేశ్వరరావులు గొడవ జరిగే చోటుకి వెళ్లి వారిని వెళ్ళిపొమ్మని చెప్పారు.

అయితే ఒక గ్రూపులో కొంతమంది మేము లోకల్ అని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోము అని మీరేంటి మాకు చెప్పేది అని డ్యూటీలో ఉన్న పోలీసు వారిపై దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుల్‌ను గాయపరిచారు. సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆ గ్రూపులోని 9 మంది వ్యక్తులపైA1. రుంజ నాగు, A2, రుంజ హరినాథ్, A3, పింగిళి సుధీర్, A4.JCL- మైనర్ బాలుడు, 5-JCL- మైనర్ బాలుడు, A6.బడుగు సాయిబాబు@ సాయి, A7. కనపర్తి శశిభూషణ్ కుమార్@సుధాకర్, A8. బలుసు నాగేంద్ర బాబు A9. తలారి అజయ్‌లపై కేసు నమోదు చేశామని ఎస్ఐ ఎస్డి షాహినా తెలిపారు. ఈ రోజు వారిని అరెస్టు చేసి కొత్తగూడెం కోర్టుకు రిమాండ్‌కు పంపగా కొత్తగూడెం కోర్టు వారికి జ్యూడిషియల్ కస్టడీకి పంపింది.

Advertisement

Next Story

Most Viewed